టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిచ్చిన సినిమా ” హాయ్ నాన్న”. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే కుటుంబమంతా కలిసి వెళ్లి చూడదగ్గ సినిమా అని చెప్పకు వస్తూ ఉంటారు .
అయితే దాన్ని ఏమాత్రం స్పాయిల్ చేసుకోకుండా నాని ఈ సినిమాలో తెరపై తండ్రి కూతురు సెంటిమెంట్ ను బాగా చూపించారు. ఇందులో డ్రామా శృతి మించేలా ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్ పాత కథలనే కొత్తగా చెప్పేప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ కథని చెప్పడం విశేషం. చాలా కన్విన్సింగ్‌గా, చాలా ఎమోషనల్‌గా ఈ సినిమాని తీసుకెళ్లాడు. ఆద్యంతం ఎమోషనల్ డ్రైవ్. ఓ వైపు తండ్రి కూతుళ్లు మధ్య బాండింగ్, మరోవైపు లవ్ స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని చాలా నీట్‌గా నడిపించాడు.
మరీ ముఖ్యంగా నాని మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . శృతిహాసన్ పాత్ర చిన్నది అయినా అభిమానులకు ఆమె పాత్ర బాగా నచ్చింది . దసరా తర్వాత మరోసారి అలాంటి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?