టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఒకదశలో నాలుగు స్థాంభాల్లా నిలిచిన వారు. వారు దర్శకులకి గానీ, నిర్మాతలకి గానీ ఎంత చెబితే అంత. దర్శకుడితో హీరోయిన్ ని కూడా మార్పించగల సమర్ధులు. కావాల్సిన అమ్మాయినే హీరోయిన్ గా తీసుకునే పట్టుదల ఉన్న వారు. ఇండస్ట్రీలో వీరు చెప్పిందే జరగాలనే టైం ఒకప్పుడు ఉండేది.
అయితే, వెంకీ, చిరు, బాలయ్య అలా సినిమా నుంచి ఎవరినీ తప్పించిన సందర్భాలు ఉన్నా అది బయటపెట్టిన వారు లేరు. పెట్టినా అందులో స్వార్థం ఉండకపోవచ్చు. కానీ, కింగ్ నాగార్జున మాత్రం తన స్వార్థం కోసం ఓ నటుడిని నిర్ధాక్షణంగా ఓ సినిమా నుంచి తప్పించాడట. ఆ సినిమా స్నేహమంటే ఇదేరా. ఈ సినిమా తమిళ చిత్రానికి రీమేక్.
అప్పట్లో తమిళ సినిమాలను ఎక్కువగా రీమేక్ చేసిన సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్. ఆర్.బి.చౌదరీ నిర్మాత. అయితే, ఈ సంస్థలో నాగార్జున నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా లాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అలా తమిళ దర్శకుడు బాలశేఖరన్ దర్శకత్వంలో స్నేహమంటే ఇదేరా సినిమాకి ప్లానింగ్ జరుగుతుంది. ముందుగా నాగార్జున, వేణిలని హీరోలౌగా అనుకున్నారు.
వేణుకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ, రేపు సినిమా ఓపెనింగ్ అనగా ఆఫీసుకి పిలిచి నాగార్జున మిమ్మలిని తీసేయమని చెప్పారు..ఆ స్థానంలో సుమంత్ చేస్తారట..మీరు ఏమీ అనుకోవద్దు. ఇంకో సినిమా చేద్దురుగానీ అని చెప్పారట. ఆ మాట విన్న వేణు కాస్త బాధపడినా సరేనండీ పర్వాలేదు అని స్నేహమంటే ఇదేరా సినిమా నుంచి తప్పుకున్నారు. ఆశించిన విజయాన్ని మాత్రం ఈ సినిమా దక్కించుకోలేదు. భూమిక, ప్రత్యూష హీరోయిన్స్ గా నటించారు.