News' గుంటూరు కారం ' ర‌న్ టైం లాక్‌... ఓపిగ్గా థియేట‌ర్ల‌లో...

‘ గుంటూరు కారం ‘ ర‌న్ టైం లాక్‌… ఓపిగ్గా థియేట‌ర్ల‌లో ఉండాల్సిందే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం గురువారంతో కంప్లీట్ చేసుకుంది. మహేష్ బాబు మంచి మాస్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇత‌ర తారాగ‌ణంగా రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్, రఘుబాబు, ఈశ్వరీ రావు, హైపర్ ఆది, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ ఆచంట, జగపతిబాబు, జయరాం కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారికా & హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.

తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయ్యింది. ఈ సినిమా టోట‌ల్ ర‌న్‌టైం మొత్తం 164 నిమిషాలు. అంటే గుంటూరు కారం ర‌న్ టైం 2.44 గంట‌ల పాటు సాగ‌నుంది. దీనిపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news