Movies"డెవిల్" VS "బబుల్ గమ్": ఈ రెండింట్లో ఏ సినిమా చూడాలి..?...

“డెవిల్” VS “బబుల్ గమ్”: ఈ రెండింట్లో ఏ సినిమా చూడాలి..? ఏ సినిమా జనాలకు నచ్చుతుంది..?

ఈరోజు బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి బడా హీరో కళ్యాణ్ రామ్ నటించిన “డెవిల్” సినిమా …అయితే మరొకటి యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేసిన బబుల్గం సినిమా . రెండు సినిమాలపై అభిమానులకి భారీగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . బింబిసారా తర్వాత హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ఫ్లాప్ అందుకున్నాడు .

డెవిల్ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు కళ్యాణ్ రామ్ . అదే విధంగా కొడుకు కోసం సుమ బాగానే సినిమా ప్రమోషన్స్ చేసింది . ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ వద్ద రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలకు సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది . అయితే చాలామంది ఫ్యామిలీస్ జనాలు ఈ రెండిటిలో ఏ సినిమా చూడాలి అంటే చాలామంది డెవిల్ సినిమాకి ఓటు వేస్తున్నారు .

బబుల్గం సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా అస్సలు కాదు . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బూతు డైలాగులు ముద్దులు హగ్గులు ఇవే కనిపిస్తాయి . అయితే డెవిల్ మాత్రం ఒక్ పిరియాడిక్ డ్రామాలాగా తెరకెక్కుతుంది . వల్గర్ సీన్స్ ఎక్కడ ఉండవు . సంయుక్త మీనన నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గా మారింది .

ఫ్యామిలీ అంతా సరదాగా కలిసి చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ వీకెండ్ కచ్చితంగా డెవిల్ సినిమా కి వెళ్ళండి అని.. బాయ్ ఫ్రెండ్ – గర్ల్ ఫ్రెండ్ లవర్స్ యూత్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకుంటే బబుల్గం సినిమాకు వెళ్లండి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news