Newsచరణ్-సమంత బట్టలు న్యాచురల్ గా మురికి గా కనిపించడానికి..సుకుమార్ ఏం చేశాడో...

చరణ్-సమంత బట్టలు న్యాచురల్ గా మురికి గా కనిపించడానికి..సుకుమార్ ఏం చేశాడో తెలిస్తే నవ్వు ఆగదు..!!

ఇప్పుడు సినిమా అంటే లగ్జరీ కార్లు ..లగ్జరీయస్ బంగ్లాలు ..హీరోయిన్ కాలు కింద పెట్టనీకుండా ఉండే సదుపాయాలు ఉంటున్నాయి . అయితే జనరల్ గా ఒక సినిమాలో హీరో హీరోయిన్ నేచురల్ లుక్స్ లో చూడడానికి ఇష్టపడతారు జనాలు ..అభిమానులు కూడా. అలాంటి సినిమాను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . ఆ పాయింట్ పట్టేసిన సుకుమార్ చరణ్ తో రంగస్థలం సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమాలో సమంత చరణ్ ఎంత నాచురల్ లుక్స్ లో కనిపిస్తారో మనకు తెలిసిందే .

అంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ మురికి బట్టల్లో మట్టి నేలల్లో నటించడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే వాళ్ల బట్టలు అలా మురికిగా రావడానికి నాచురల్ లుక్స్ లో కనిపించడానికి సుకుమార్ బాగా కష్టపడ్డారట . వాళ్ళు వేసుకునే బట్టలు రెండు రోజులు ముందే టీ డికాషన్..కాఫీ డికాషన్ లో ముంచేత్తి ఒక రోజంతా ఆరబెట్టే వారట . అప్పుడు ఆ మురికి అలాగే దట్టంగా కనిపించేదట.

ప్రతి షాట్ కి కూడా సుకుమార్ ఇలాగే చేశారట . కేవలం సమంత – రామ్ చరణ్ వేసుకునే బట్టలే కాదు ..పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించే వాళ్ళ బట్టలను కూడా అంతే మురికిగా కనిపించడానికి అలాంటి కాఫీ డికాషన్ పొడిలో ఎత్తి డ్రై అయ్యాక వాటిని వేసుకోమని చెప్పేవారట . సీన్ అంత క్లియర్ గా రావడానికి ఎంతకైనా తెగిస్తాడు సుకుమార్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అంతే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news