టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతగా అద్భుతమైన సినిమాలు చేసిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్రప్రసాద్ కొడుకు జగపతి చౌదరి. హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాక జగపతిబాబుగా పేరు మార్చుకున్నారు. జగపతిబాబు హీరోగా నటించిన మొదటి సినిమా సింహ స్వప్నం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత చాలామంది జగపతిబాబు హీరోగా పనికిరాడని కామెంట్స్ చేశారు. మొదటి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి అందరూ నెగిటివ్‌గా కామెంట్స్ చేశారు. దాంతో కొన్నాళ్ళు జగపతిబాబు డిప్రషన్ లో ఉన్నాడు. ఆయనకి అత్యంత సన్నిహితులు ప్రోత్సహించడంతో పెద్దరికం సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం జగపతిబాబుకి రాలేదు.
ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్స్ అంటే కేరాఫ్ అడ్రస్‌గా మారారు జగపతిబాబు. అప్పటి జనరేషన్లో శోభన్ బాబుకి ఎలాంటి ఇమేజ్ వచ్చిందో ఫ్యామిలీ హీరోగా, ఇద్దరు పెళ్ళాల తో రొమాన్స్ చేసే హీరోగా ఆ తర్వాత జనరేషన్లో ఒక్క జగపతిబాబుకే మళ్ళీ అలాంటి పేరు వచ్చింది. శుభలగ్నం లాంటి సినిమాలు జగపతి తప్ప ఇంకొకరు చేయలేరనేంతగా ఇండస్ట్రీ మాట్లాడుకుంది.
అలాంటి సినిమాలు చేస్తున్న సమయంలోనే అంతపురం సినిమాలో ఓ కామియో చేసి మెప్పించాడు. సినిమాలో మొత్తంగా ఉండేది 10 నుంచి 15 నిముషాలే. కానీ, కేకలు పుట్టిస్తాడు. క్లైమాక్స్ జగపతి వల్లే అంత పేరొచ్చిందని చెప్పుకున్నారు. ఇదే రోల్ ని హిందీలో షారుఖ్ ఖాన్ చేశాడు. కానీ, ఆయన జగపతిబాబు మాదిరిగా చేయలేకపోయానని ఇప్పటికీ సందర్భం వస్తే అంటుంటాడు. అంతేకాదు, ఓ బెస్ట్ కాంప్లిమెంట్ గా ఇంత బాగా ఎలా చేశాడు ఈ సీన్ బాస్టడ్..నేను ఎంత ట్రై చేసినా అతనిలా చేయలేకపోయాను..అని అందరి ముందు ఒప్పుకున్నాడు షారుఖ్.