Moviesఓరి దేవుడోయ్: అర్జున్ అంబాటికి బిగ్ బాస్ అన్ని లక్షలు రెమ్యూనరేషన్...

ఓరి దేవుడోయ్: అర్జున్ అంబాటికి బిగ్ బాస్ అన్ని లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చాడా..? ప్లస్ బోనస్ గా అది కూడా నా..?

అర్జున్ అంబాటి పలు సీరియల్స్ లో తనదైన స్టైల్ లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలో ఓ కామన్ హీరోకి ఎంత పాపులారిటీ ఉంటుందో.. అంతకు డబల్ రేంజ్ లో సీరియల్స్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈయన పలు రియాలిటీ షోలల్లో కూడా పాల్గొని తన భార్య సురేఖతో సందడి చేశారు .

కాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అర్జున్ అంబాటి హౌస్ లోకి అడుగుపెట్టిన మొదలు ఎలిమినేట్ బయటకు వచ్చేవరకు తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించాడు . అంతేకాదు జెన్యూన్ గా గేమ్ ఆడి అభిమానుల మనసులను కొల్లగొట్టాడు . కచ్చితంగా విన్నర్ కాలేను అని నమ్మకం ఉన్న అర్జున్ అంబాటి టాప్ ఫైవ్లో కచ్చితంగా ఉంటానని నమ్మకం పెట్టుకున్నాడు .

కానీ టాప్ 6 ప్లేస్ లో బయటకు వచ్చేసాడు . కాగా బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఇన్ని వారాలు ఉన్నందుకుగాను ఎంత రెమ్యూనరేషన్ ముట్టింది అనే విషయం వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. వారానికి 35000 చొప్పున మొత్తంగా హౌస్ లో ఉన్నందుకు 245000 తీసుకున్నాడట . అంతేకాదు మాటీవీ యాజమాన్యంతో ఒక సీరియల్ కి కూడా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news