News"ఇప్పుడు వాడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు..?".. అయ్యయ్యో అంత మాట అనేశాడు...

“ఇప్పుడు వాడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు..?”.. అయ్యయ్యో అంత మాట అనేశాడు ఏంటి..?

రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . బహుశా నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ కౌంటింగ్లో అదే జరిగి ఉండొచ్చు. చాలామంది మళ్లీ కేసిఆర్ సీఎం పదవి చేపడతాడు అంటూ ఆశలు పెట్టుకున్నారు . అయితే ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి . కనీ విని ఎరుగని రేంజ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది .

మరీ ముఖ్యంగా తెలంగాణలో అసలు రాదు అనుకున్న కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలో నిల్చోపెట్టిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి కే దక్కుతుంది అంటూ పలువురు సినీ స్టార్స్ కూడా పొగిడేస్తున్నారు. ఆర్జీవి అయితే ఏకంగా తెలంగాణకు బాహుబలి లాంటివాడు రేవంత్ రెడ్డి అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . పలువురు సిని ప్రముఖులు ..రాజకీయ నేతలు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఏది చెప్తే అది జరుగుతుంది అంటూ ఇన్నాళ్లు ఇండస్ట్రీలో జనాలు బాగా నమ్మేశారు.. సమంత , ప్రభాస్, నీహారికల విషయంలో ఆయన చెప్పినట్లే జరుగుతూ వచ్చింది . ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ ఎన్నికలలో మళ్ళీ అధికారం చేపట్టేది కేసీఆర్ నే అంటూ చెప్పిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ ..” ఇప్పుడు ఏం మాట్లాడుతావు ..?”అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు .

మరి కొంతమంది రెచ్చిపోయి ” ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు..? ఇక జాతకం , జ్యోతిష్యం చెప్పడం మానేస్తావా ..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పేరుని తెగ ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news