Moviesఎన్టీఆర్ సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది... కామెడీ + యాక్ష‌న్ చూస్తారా.. (...

ఎన్టీఆర్ సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది… కామెడీ + యాక్ష‌న్ చూస్తారా.. ( వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన‌ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్. 2010 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా ఎన్టీఆర్ కి జోడిగా నయనతార, షీలా హీరోయిన్గా నటించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అదుర్స్ ఎన్టీఆర్ – వివి.వినాయక్‌ కాంబినేషన్లో హ్యాట్రిక్‌ హిట్ సినిమాగా నిలిచింది. అంతకుముందు వీరి కాంబినేషన్లో ఆది, సాంబ సినిమాల వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అదుర్స్ – ఎన్టీఆర్ – వివి.వినాయక్‌ కాంబినేషన్లో హ్యాట్రిక్‌ హిట్ సినిమాగా నిలిచింది. అంతకుముందు వీరి కాంబినేషన్లో ఆది ,సాంబ సినిమాలో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో న‌డుస్తోన్న రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ సినిమాను ఈ నెల 18న 4కే వెర్ష‌న్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. సినిమా ట్రైల‌ర్ క‌ట్ డిఫ‌రెంట్‌గా ఉంది. 4కే వెర్ష‌న్ కావ‌డ‌తో ఎన్టీఆర్ అభిమానులు అంద‌రూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రీ రిలీజ్ పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news