Newsకోటీశ్వ‌రులు వెంట‌ప‌డుతున్నా త‌మ‌న్నా ఆ త‌ప్పు చేసే విజ‌య‌వ‌ర్మ‌తో పెళ్లికి క‌మిటైందా...!

కోటీశ్వ‌రులు వెంట‌ప‌డుతున్నా త‌మ‌న్నా ఆ త‌ప్పు చేసే విజ‌య‌వ‌ర్మ‌తో పెళ్లికి క‌మిటైందా…!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళపైగా ఏలుతుంది మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. మొదటి సినిమా బాలీవుడ్ లో ఫ్లాప్. అలాగే తెలుగులోనూ ఫ్లాప్. అయినా శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలతో నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్.టి.ఆర్ లాంటి వారు తమన్నా కావాలనుకున్నారు.

బాలీవుడ్‌లో అంతగా సక్సెస్ కాకపోయినా ఇటు తెలుగులో అటు తమిళంలో తమన్నా అందాలతో ఊపేసింది. తమిళంలో కూడా తమన్నా అంటే మంచి క్రేజ్ ఉంది. అక్కడ కూడా స్టార్ హీరోలతో ఆడిపాడింది. తమన్నాది ఏ హీరోకైనా సూటయ్యే పర్సనాలిటీ. అందుకే, ఇంతకాలం ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది. ఇక ఐటెం సాంగ్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈ మిల్కీబ్యూటీనే. తమ్ము బేబీ ఐటెం సాంగ్ చేసిందంటే అది సినిమాకి ప్లస్ అవుతుంది.

అయితే, ఈ మధ్య కాస్త తమన్నాకి అవకాశాలు తగ్గాయి. అది సినిమాలలో మాత్రమే. వెబ్ సిరీస్‌లలో మాత్రం గట్టిగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల తమన్నా లస్ట్ స్టోరీస్ 2లో నటించినిద్. విజయ్ వర్మ సరసన నటించిన తమన్నా ఇంటిమేట్ సీన్స్‌లో ఎవరూ ఊహించనంతగా రెచ్చిపోయింది. శృంగారపు సన్నివేశంలో తమన్నా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవడికైనా మూడ్ వస్తుంది.

అయితే, ఇప్పుడు అదే విజయ్ వర్మని తమన్నా పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం అవుతోంది. నిజంగా తనకు ఇప్ప‌టికే అన్నీ అర్పించేసుకుంద‌ని… అందుకే పెళ్లికి కమిటైందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. లేదంటే వందల కోట్లున్న బిజినెస్ మేన్ గానీ, పెద్ద దర్శకనిర్మాతలు గానీ తమన్నాని పెళ్లి చేసుకునేందుకు వస్తున్నారని..తమన్నా ఆవేశంలో తప్పుడు పనిచేసింది కాబట్టే విజయ్ వర్మతో పెళ్లికి రెడీ అయిందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news