సాధారణంగా ఇండస్ట్రీ అంటే.. హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నా.. అభిమానులు ఓకే చెబుతారు. కానీ, హీరోయిన్ల విషయంలో మాత్రం అలాకాదు. పెళ్లయిందంటే..ఇక, వారికి క్యారెక్టర్ పాత్రలే శరణ్యం. ఇలాంటివారిలో సావిత్రి ముందు వరుసలో ఉంటారు. ఆమె.. జెమినీ గణేష్‌ను వివాహం చేసుకోనంత వరకు అనేక సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు చిక్కించుకున్నారు. కానీ, జెమినీ గణేష్ఃతో వివాహం తర్వాత.. అవకాశాలు తగ్గిపో్యి.. క్యారెక్టర్ పాత్రలు వచ్చాయి. అయితే.. జెమినీ గణేష్ తన మిత్రుల ద్వారా.. సావిత్రికి హీరోయిన్ పాత్రలు ఇప్పించుకునే పరిస్థితి వచ్చిందని అంటారు.
ఇక, అంజలీదేవి విషయం సెపరేటు. ఆమె వివాహానికి ముందు అనేక సినిమాల్లో నటించారు. అయితే.. వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్‌గా నే నటించారు. కానీ, ఆ సినిమాలన్నీ కూడా.. అంజలీ పిక్చర్స్ పతాకంపై సొంతంగా తీసుకున్నవే. అవన్నీ హిట్టే కొట్టాయి. కానీ, బయట నుంచి మాత్రం ఏ నిర్మాతా సాహసం అయితే చేయలేదు. ఇలానే భానుమతి కూడా. వివాహానికి ముందు.. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తే.. వివాహం అనంతరం.. భరణి పిక్చర్స్ అనే సొంత సంస్థను ఏర్పాటు చేసుకుని దానిలో నటించారు. ఇలా.. పెళ్లికి ముందు తర్వాత.. హీరోయిన్ల విషయంలో మార్పు అయితే.. స్పష్టంగా కనిపించింది.
అయితే.. ఒకే ఒక్కరి విషయంలోమాత్రం చాలా భిన్నమైన పరిస్థితి ఉంది. ఆమే షావుకారు జానకి. షావుకారు జానకి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు, తమిళ కన్నడ భాషల్లో ప్రేక్షకులని అలరించిన గొప్ప నటి. చాలామంది నటీమణులకు అవకాశాలు రావటమే చాలా తక్కువైతే.. అందునా.. ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి వంటివారితో చేసే చాన్స్ రావడం.. నిజంగా నక్కతోక తొక్కినట్టే. కానీ.. బీఎన్ రెడ్డి తన సినిమాలో హీరియిన్‌గా ఛాన్స్ ఇస్తాను అంటే తిరస్కరించిన నటి జానకి.
అంతేకాదు.. చాలా మంది నటీమణులు పెళ్ళికాకముందు సినిమాపరిశ్రమలో ప్రవేశించి తరువాత పెళ్లిచేసుకొని చాన్స్‌లు మిస్ చేసుకున్నారు. కానీ జానకి తనకి పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక సినిమారంగంలోకి వచ్చారు. అంతేకాదు.. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. సక్సెస్ కొట్టారు. షావుకారు సినిమా సమయానికే జానకికి వివాహం అయి… ఒక బాబు కూడా ఉన్నారట. అయినా..ఎక్కడా అలాంటి సందేహాలు రాకుండా.. నటించడం ఆమె విశేషం.