ఎస్ ఎస్ థమన్..ప్రస్తుతం టాలీవుడ్ లో అన్నీ రకాలుగా హాట్ టాపిక్. ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలు మ్యూజికల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అఖండ, భగవంత్ కేసరి సినిమాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీంలా నాయక్ సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
ఇప్పుడు తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్న సంగీత దర్శకుడు థమన్ కావడం విశేషం. సాంగ్స్ కూడా బాగా హిట్టవుతున్నాయి. ఒకవైపు కాపీక్యాట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ అందరూ థమన్ కే సినిమా అప్పచెబుతున్నారు. థమన్ కూడా రెమ్యునరేషన్ తక్కువేమీ తీసుకోవడం లేదట. ఒక్కో సినిమాకి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ లాగుతున్నాడట.
అయితే, కొన్నిసార్లు నిర్మాతలకి థమన్ బాగానే వాతలు పెడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమని పార్క్ హయాత్ హోటల్ లో రూం వేసుకొని ఫైనల్ గా 45 లక్షలు బిల్లు పంపాడట. ఆ బిల్లు చూసి నిర్మాతకి చుక్కలు కనిపించాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మరీ 45 లక్షలు ఏంటీ..? అని నిర్మాత సన్నిహితులు షాకవుతున్నారట.
ఇదే గనక కంటిన్యూ అయితే థమన్ ని నిర్మాతలు తీసి పక్కనపెట్టేస్తారు. ఆల్రెడీ దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మ, మహతి స్వరసాగర్, గోపీ సుందర్, అనూప్ రుబెన్స్, అనిరుధ్..లాంటి ఫాంలో ఉన్న సంగీత దర్శకులున్నారు. కాబట్టి థమన్ గనక ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే గ్యారెంటీగా అవకాశాలు తగ్గడం ఖాయం. ఇప్పటి వరకూ ఈ రేంజ్‌లో బిల్లు బాదినవాళ్ళు లేరనే చెప్పాలి.