Newsసీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఆ ఒక్క గుణమే..ఆయన కొంప నిలువునా...

సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఆ ఒక్క గుణమే..ఆయన కొంప నిలువునా ముంచేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తున్నారు .. పోతున్నారు కానీ అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిన హీరో మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి . ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని.. ఒక్కొక్కరు 70 – 80 – 90 – 100 కోట్లు అందుకుంటున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన మార్క్ ఆయనద్నే చెప్పాలి.

కాగా చాలామంది ఎన్టీఆర్ లోని మంచి క్వాలిటీ ఎక్కువగా చెప్పుకొస్తూ ఉంటారు . సీనియర్ ఎన్టీఆర్లో చెడు క్వాలిటీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు . కానీ ఆయన చేసిన మంచి ఆయనకు చెడుగా మారి ఆయన లైఫ్ ని అనుకొని మలుపులు తిప్పింది . మొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి మంచితనం ఎక్కువ . ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తాడు . అంతేకాదు అతగాడు గతంలో తప్పులు చేసిన సరే ఈసారి మంచి చేస్తాడేమో..? నిజంగానే బాగుపడతాడేమో..? అని భావించే టైప్ .

అలా ఆయన ఎంతోమందికి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో , రాజకీయాలలో గుడ్డిగా కొందరిని నమ్మి ఆయన తన కష్టాలను తానే కొని తెచ్చుకున్నాడు . ఆ విషయాలన్నీ మనకు బాగా తెలిసిందే అందుకే ఎన్టీఆర్ కు ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ మంచితనం అంటూ నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ మంచితనమే ఎన్టీఆర్ కొంప ముంచేసింది అని లాస్ట్ రోజుల్లో ఆయనను ఇబ్బంది పెట్టింది అని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news