వాట్ .. ఏంటి తరుణ్ తండ్రి కాబోతున్నాడా? అసలు ఆయనకు పెళ్ళే కాలేదు కదా మరి తండ్రి ఎలా కాబోతున్నాడు ..ఏంటి సస్పెన్స్ అని ఆశ్చర్యపోతున్నారా ..?షాక్ కి గురవుతున్నారా..? ప్రభాస్ – తరుణ్ తండ్రి కాబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ తండ్రి రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ తరుణ్ ఒకప్పుడు స్టార్ హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే .
ఎన్నెన్ని మంచి సినిమాల్లో నటించి అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ మనం టీవీలో నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను .. సినిమాలు చూసి పడి పడి నవ్వుకుంటున్నామంటే దానికి కారణం తరుణ్ నటన అని మర్చిపోకూడదు . అలాంటి తరుణ్ ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా దూరమైపోయాడు . సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . పలు ఆఫర్స్ వస్తున్నా కూడా మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు .
ఫైనల్లీ ఆ మంచి పాత్ర వచ్చేసింది. బడా హీరో సినిమాలో సెకండ్ హీరోగా తరుణ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్నట్లు కూడా సమాచారం వైరల్ అవుతుంది . ఈ సినిమాలో తరుణ్ ఓ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో తరుణ్ కి జోడిగా మీరా జాస్మిన్ కనిపించబోతుందట. ఇలా తరుణ్ పెళ్లి కాకుండానే తండ్రి రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . చూద్దాం దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?