News' గుంటూరు కారం ' ద‌మ్ మ‌సాలా యూట్యూబ్‌లో వీరంగం... ఆల్...

‘ గుంటూరు కారం ‘ ద‌మ్ మ‌సాలా యూట్యూబ్‌లో వీరంగం… ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు నుంచి తెలుగు సినిమా అభిమానులతో పాటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థ‌మన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి దమ్‌ మసాలా అనే ప‌ల్ల‌వితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే దమ్ మసాలా సాంగ్ మరీ భారీ అంచనాలు అయితే అందుకోలేదు. థ‌మన్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ అలవైకుంఠ‌పురంలో రేంజ్‌లో అయితే లేదు. రామజోగయ శాస్త్రి, మహేష్ బాబు క్రేజ్, ఛ‌రిష్మాకు తగినట్లుగా లిరిక్స్ రాసినా థ‌మన్ అందించిన మరీ అంత గొప్పగా లేదన్న టాక్ వచ్చింది.

ట్యూన్ ఎలా ఉన్నా కూడా సాంగ్ అయితే యూట్యూబ్‌లో బ‌జ్‌ క్రియేట్ చేసింది. 24 గంటల్లో ఏకంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఫస్ట్ డే అత్యధిక వ్యూస్ అందుకున్న సాంగ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో ? అంచనాలు ఉన్నాయో.. తెలుస్తోంది. హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ( చినబాబు ) నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news