సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శివ తర్వాత తీసిన చాలా సినిమాలు అప్పట్లో మంచి కమర్షియల్ హిట్స్ సాధించాయి. అదే సమయంలో ఆయన తన భార్యకి డివోర్స్ ఇవ్వడం..ఊర్మిళతో రిలేషన్ మేయిన్‌టైన్ చేయడం వంటి విషయాలను ఆయనే స్వయంగా చెప్పారు. ఆర్జీవీ దగ్గర పనిచేసిన వారిలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాధ్, జేడీ చక్రవత్రి లాంటి వారు ఎందరో ఉన్నారు.
బాలీవుడ్లో ఇప్పుడు టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టెక్నీషియన్స్ లో 80 శాతం ఆర్జీవీ దగ్గర పనిచేసిన వాళ్ళే. ఆయన ఎన్ని సంచలన ట్వీట్స్ పెట్టిన ఆర్జీ అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం చూపించే వారిలో రాఘవేంద్ర రావు, రాజమౌళి, అమితాబ్ బచ్చన్, నాగార్జున, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, విజయేంద్ర ప్రసాద్ లాంటి గొప్పవారు ఉన్నారు.
అలాగే, దివంతగ నటి శ్రీదేవి ఉంది. ఆర్జీవితో శ్రీదేవి చాలా విషయాలను చెప్పారట. క్షణ క్షణం సినిమా, గోవింద గోవింద సినిమాలు ఆర్జీవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే జేడీ చక్రవర్తి అప్పట్లో ఆర్జీవీ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. క్షణ క్షణం సినిమా షూటింగ్ సమయంలో జేడీ క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో శ్రీదేవి మెట్లు దిగి కిందకి వస్తుంది. ఆ సీన్ చిత్రీకరిస్తున్నారు.
క్లాప్ బోర్డ్ పట్టుకొని జేడీ కింద ఉంటే వేరే చోట రామూ మానీటర్ ముందు కూర్చొని ఉన్నారు. శ్రీదేవి స్కట్ లో ఉంటుంది. అలా ఆమె దిగి వచ్చేటప్పుడు జేడీ పైకి చూడగా శ్రీదేవి వేసుకున్న ఇన్నర్ కనిపించిందట. అది వెళ్ళి రామూ కి చెప్పాడట జేడి. ఇక చూడండి..సెట్ అంతా అరుపులు కేకలు..సాయంత్రం ఆర్జీవీ జేడీతో సహా అందరికీ పెద్ద పార్టీ ఇచ్చారట. దీన్ని ఏ రకం శాడిజం అనుకోవాలో మరి..!