డైరెక్టర్ పూరి జగన్నాధ్..ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్, వెంకటేశ్‌లతో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో సినిమాలు చేసి భారీ హిట్స్ ఇచ్చాడు. ఆయనతో సినిమా చేసిన ప్రతీ హీరోకి విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. మాస్ హీరోలుగా సెటిలవుతారు. దర్శకుడిగానే 100 కోట్లను సంపాదించాడు.
ఆయన మొదటి సినిమానే పవన్ కళ్యాణ్‌తో చేయడం..అది ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం అందరికీ తెలిసిందే. బద్రి సక్సెస్ తర్వాత పూరి కొంతకాలం వరుస హిట్స్‌తో ఓ ఊపు ఊపాడు. ఆ సమయంలో ఆంధ్రావాలా కథ రాసుకొని మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. ఆయన కథ విన్న తర్వాత మళ్ళీ చెప్తానని పంపించారట. ఆ తర్వాత అదే కథని అప్పట్లో రచయితగా సంచలనం సృష్ఠించిన చిన్నికృష్ణ కి పంపారట.
చిన్నికృష్ణ కథ మొత్తం చదివి ఒక కవర్‌లో చిరంజీవి ఇచ్చిన వైట్ పేపర్‌ని నాలుగు ముక్కలుగా చించేసి అదే కవర్‌లో పెట్టి మళ్ళీ చిరంజీవికి పంపారట. దానర్థం కథ చిరంజీవికి సూటవదని చిన్నికృష్ణ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు. దాంతో చిరంజీవి ఆంధ్రావాలా కథను రిజెక్ట్ చేశాడు. అదే కథను తారక్ కి చెప్పి ఆయన ఓకే అనగానే సినిమా చేశారు పూరి. ఫలితం అందరికీ తెలిసిందే.
చిన్నికృష్ణ గనక ఆంధ్రావాలా కథ బావుందని చెప్పి ఉంటే చిరంజీవి ఖాతాలో ఓ డిజాస్టర్ పడేది. అది మిస్సయి తారక్ ఖాతాలో పడింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఉన్న ఆస్తులన్నీ పోయాయి. రోడ్డున పడ్డాడు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి 143 తీసి ఫాంలోకి వచ్చాడు. కథ మీద పట్టుంటే ఏ రచయిత అయినా అది ఆడదని చెప్పగలిగే సత్తా ఉంటుంది.