Newsచిరంజీవి, కృష్ణంరాజుకు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చిన కృష్ణ‌... ఆ టాప్ సీక్రెట్...

చిరంజీవి, కృష్ణంరాజుకు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చిన కృష్ణ‌… ఆ టాప్ సీక్రెట్ ఇదే…!

తెలుగు సినీ పరిశ్రమంలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాల గురించి అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ పరిశ్రమ ఎదుగుదలకు.. కృష్ణ చాలా డేరింగ్ నిర్ణయాలు తీసుకుని సినిమా పరిశ్రమకు ఎంతో మేలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ స్థాయిని పెంచిన నటుల్లో కృష్ణ కూడా ముందు వరుసలో ఉంటారు. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

అంత గొప్ప నటుడు, మంచి మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్లి అప్పుడే ఏడాది గడిచింది. సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ఆయన తోటి నటీనటులు కూడా ఆయనతో ఉన్న‌ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ తనకు వచ్చిన అవకాశాలను కూడా వేరే నటులకు ఇవ్వాలని సలహా ఇచ్చి.. ఆ హీరోలు సూపర్ డూపర్ హిట్లు కొట్టి కెరీర్ పరంగా నిలదొక్కు కావడానికి కారణమైన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మంచి కథ తన దగ్గరకు వస్తే తాను వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ కృష్ణ ఒక్కోసారి తనకు ఆ కథ అంతగా సూట్ కాదు అనిపిస్తే వేరే హీరోల దగ్గరకు పంపించి.. వాళ్లు సూపర్‌హిట్‌ కొట్టడానికి కారణమయ్యారు. చిరంజీవి కెరీర్ మలుపు తెప్పి ఆయను తిరిగిలేని మెగాస్టార్‌గా ఎదగటానికి కారణమైన సినిమా ఖైదీ. ఖైదీ కథ‌ ముందుగా కృష్ణ దగ్గరకు రాగా ఈ కథ చిరంజీవికి బాగా సూట్ అవుతుంది.. కొత్త హీరో అయితే ఇందులో బాగుంటాడు అని చెప్పి చిరంజీవికి సజెస్ట్ చేశారు. ఖైదీ చిరంజీవి కెరీర్‌ను ఎంతలా ? మలుపు తిప్పిందో తెలిసిందే.

ఇక కటకటాల రుద్రయ్య సినిమా కోసం ముందుగా కృష్ణ గారిని సంప్రదిస్తే ఆప్పుడు కూడా ఈ కథ కృష్ణంరాజుకి బాగుంటుందని కృష్ణంరాజు దగ్గరికి పంపారు. అలా ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తనతో పాటు తన నటీనటులకు కూడా మంచి సక్సెస్ రావాలని ఆశించే నిస్వార్ధమైన వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణ ను ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయన హీరోగా తనతో సినిమా తీసిన నిర్మాతలు ఎవరైనా నష్టపోతే వాళ్లకు వెంటనే తర్వాత సినిమాకు ఉచితంగా కాల్ షీట్లు ఇచ్చి వాళ్లకు లాభాలు వచ్చేలా చేసేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news