Newsబ‌న్నీని నితిన్‌తో టార్గెట్ చేయిస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... త‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్...

బ‌న్నీని నితిన్‌తో టార్గెట్ చేయిస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… త‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ ఇచ్చి మ‌రీ…!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య గ్యాప్ అయితే గత ఆరేడేళ్ల నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రుద్రమదేవి సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటూ పవన్ అభిమానులు హంగామా చేసినప్పుడు ఇబ్బంది చెప్పను బ్రదర్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు బ‌న్నీ. అప్పటి నుంచి బన్నీ చాలాసార్లు పవన్ కళ్యాణ్ అభిమానులను క‌వ్వించే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రారంభంలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పిన బన్నీ చాలాసార్లు ప‌వ‌న్‌ భజన చేస్తూ వచ్చారు. రేసుగుర్రం తర్వాత పవన్ గురించి బన్నీ చేసే కార్మికుల కాస్త తేడా కనిపిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నితిన్‌ను బాగా ఎంక‌రేజ్ చేస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌తి యేటా త‌న ఫామ్ హౌస్‌లో పండించిన మామిడిపండ్ల‌ను కూడా పార్సిల్ చేసి మ‌రీ నితిన్‌కు పంపిస్తూ ఉంటాడు.

తాజాగా నితిన్ న‌టించిన త‌న ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా నితిన్ తాను ప‌వ‌న్‌కు వీరాభిమానిని అని చెప్పుకుంటూ తాను క్రేజ్ వ‌చ్చాక త‌న‌కు తానే హీరోను అని చెప్ప‌కోనంటూ ప‌రోక్షంగా బ‌న్నీని టార్గెట్ చేసిన ప‌రిస్థితి. నితిన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ అభిమానులు వైర‌ల్ చేస్తూ బ‌న్నీ ఫ్యాన్స్‌కు ట్యాగ్ చేస్తున్నారు.

ఇక నితిన్ నెక్ట్స్ సినిమా టైటిల్ కూడా త‌మ్ముడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. వేణు గ‌తంలో ప‌వ‌న్ తో వ‌కీల్‌సాబ్ సినిమా తెర‌కెక్కించి హిట్ కొట్టారు. అంత‌కుముందు బ‌న్నీతో ఐకాన్ అనే సినిమా చేస్తాన‌ని రెండేళ్ల‌కు పైగా టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే డైరెక్ట‌ర్ నితిన్ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ త‌మ్ముడు వాడుకుంటున్నారు. ఇలా ఎలా చూసినా నితిన్‌కు ప‌వ‌న్‌, ప‌వ‌న్ అభిమానుల స‌పోర్ట్ అయితే మామూలుగా లేదు.

అటు ఈ తంతు గ‌మ‌నిస్తోన్న బ‌న్నీ అభిమానులు కూడా పుష్ప 2 త‌ర్వాత అస‌లు బ‌న్నీ ముందు ప‌వ‌న్ అడ్ర‌స్ గ‌ల్లంతు కూడా అవుతుంద‌ని అంటుంటే బ‌న్నీ ఎప్ప‌ట‌కీ ప‌వ‌న్ క్రేజ్‌, స్థాయి అందుకోలేడంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news