ప్రజెంట్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ తో తన 31 వ సినిమాలో నటించబోతున్నాడు . ఆ తర్వాత వెంటనే దేవర 2 సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు . అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ బిజీగా ఉన్న తారక్ లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారట.
కేవలం యాక్టింగ్ ఏ కాకుండా ప్రొడ్యూసింగ్ సైడ్ కూడా వెళ్లాలి అంటూ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట . ఎన్టీఆర్ త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చేయబోతున్నారట . అంతేకాదు సినిమాలను నిర్మించాలని కూడా డిసైడ్ అయ్యారట . టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆలోచనలు ఉన్నా కూడా అవకాశాలు లేక అల్లాడిపోతున్న టాలెంటెడ్ పీపుల్స్ కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో డిఫరెంట్గా ఆలోచించడం ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ వార్తని ట్రెండ్ చేస్తున్నారు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్..తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు తారక్..!!