Newsఎన్టీఆర్ ఇక‌నైనా ఈ ప‌నులు ఆపేస్తే బెట‌ర్‌.. లేక‌పోతే ప‌రువు గోవిందా...!

ఎన్టీఆర్ ఇక‌నైనా ఈ ప‌నులు ఆపేస్తే బెట‌ర్‌.. లేక‌పోతే ప‌రువు గోవిందా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర పార్ట్ 1 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైన సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్టీఆర్‌ను ఢీకొట్టే విలన్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న దేవర సినిమాలో రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానుల కోసం ఆయన నటించిన బ్లాక్ బస్టర్ అదుర్స్ సినిమాను ఈ నెల 18న రీ రిలీజ్ చేస్తున్నారు. వివి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. ఎన్టీఆర్‌కు జోడిగా నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండడంతో అదుర్స్‌కు అనుకున్న స్థాయిలో బుకింగ్స్ జరగటం లేదు.

హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలో పలు పట్టణాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. కనీసం అభిమానులు కూడా ఈ సినిమాను పట్టించుకున్నట్లు కనపడటం లేదు. రీరిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఖుషి, పోకిరి, ఎన్టీఆర్ సింహాద్రి లాంటి సినిమాలు కు మినహా మిగిలిన సినిమాలుకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన డిజాస్టర్ ఆంధ్రావాలా, ఆది సినిమాలను రీ రిలీజ్‌ చేసిన ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు అదుర్స్ సినిమాను రిలీజ్ చేస్తున్న కనీసం అభిమానుల నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఇకనైనా ఏదైనా సరైన సందర్భం లేదా.. ఎన్టీఆర్ పుట్టినరోజు లాంటి రోజుల్లో మినహాయించి పాత సినిమాల ట్రెండ్ ఆపకపోతే.. పరువు పోయేలా ఉంది. ఎన్టీఆర్ ఇకనైనా తన సినిమాల రిలీజ్ విషయంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే సరైన వసూళ్ళు లేక అనవసరంగా ట్రోలింగ్‌కు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news