Newsచిరంజీవి లేడీ సింగ‌ర్‌ను అలా ప‌ట్టుకున్నారా... అస‌లు జ‌రిగింది వేరు...!

చిరంజీవి లేడీ సింగ‌ర్‌ను అలా ప‌ట్టుకున్నారా… అస‌లు జ‌రిగింది వేరు…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాంట్రవర్సీలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎలాంటి సెన్సిటివ్ అంశాలపై అయినా.. ఆయన చాలా సున్నితంగా స్పందించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం.. ఎంత మంచి హీరో అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ట్రోలింగ్‌కు గురికాక తప్పడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల డ్యాన్స్‌ చేసిన విధానంపై కూడా సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ నడిచింది.

చిరంజీవి తాజాగా దీపావళి పండుగ సందర్భంగా కొంతమంది సెలబ్రిటీతో కలిసి ప్రత్యేకంగా పార్టీ చేసుకున్నారు. అదే వేడుకలో జవాన్ సినిమాలో ఒక పాటకు ఒక లేడీ సింగర్‌తో కలిసి ఆయన చాలా స్టైలిష్‌గా స్టెప్పులు వేశారు. ఈ వయసులో కూడా చిరంజీవి అంత జోష్‌తో స్టెప్పులు వేయటం నిజంగా ఆయన డ్యాన్స్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.

మెగా అభిమానులతో పాటు.. సగటు సినీ అభిమానులు అందరూ ఈ వీడియోను పిచ్చపిచ్చగా షేర్ చేశారు. అయితే కొందరు పైశాచిక వాదులు మాత్రం కావాలని దానిపై ట్రోల్లింగ్ చేసినట్టు స్పష్టంగా కనబడుతోంది. చిరంజీవి ఆ లేడీస్ సింగర్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ చివరగా ఆయన ఆమె దగ్గర వెళ్లిన విధానాన్ని కొందరు తప్పు పడుతూ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చిరంజీవి అలాంటి అంశాలకు చాలా దూరంగా ఉంటారు. ఆ పాట పడటం పూర్తయ్యాక చిరంజీవి ఆమెను చాలా సున్నితంగా హత్తుకునే ( అది కూడా పూర్తిగా హ‌త్తుకోలేదు కూడా) ప్రయత్నం చేస్తూ అభినందించారు.

అయితే కొందరు మాత్రం కావాలని ఆ సింగర్‌ను చివరగా టచ్ చేసిన విధానాన్ని హైలైట్ చేస్తూ తప్పుపడుతున్నారు. వాస్తవంగా చిరంజీవికి ఇలాంటి ఉద్దేశం లేదు. ఆమె పాట పాడుతూ.. తనతో డ్యాన్స్ చేసిన తీరుకు ఫిదా అయి ఆమెను అభినందించారు. అది కూడా తెలియని పైశాచిక వాదులు కావాలని ఆయనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news