టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం ఉండని వారుండరు. ఇక ఆయన సినిమాలో చిన్న రోల్ చేసే ఛాన్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కానీ, మాస్ మహారాజాగా స్టార్ డం తెచ్చుకున్న రవితేజ మాత్రం చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి అడిగినా ఆయన సినిమాలో నటించనని తెగేసి చెప్పాడట. అప్పట్లో ఈ న్యూస్ ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ అయింది.
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన మున్నభాయ్ ఎంబిబిఎస్. ఈ సినిమాలో సంజయ్ దత్ నటించారు. ఇందులో ఏటీఎం పాత్రలో అర్షాద్ వర్షి నటించాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అన్ని బాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దాంతో అక్కడ అర్షద్ పోషించిన పాత్ర కోసం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గా రవితేజని అనుకున్నారు. అలాంటీ ఊర మాస్ క్యారెక్టర్ చేయాలంటే రవితేజ తప్ప ఇంకెవరూ లేరని ఫిక్సైయ్యారు.
అందుకే, ఈ విషయం చిరంజీవికి చెప్పారు. ఆయన కూడా సరే అని స్వయంగా రవితేజ కి కాల్ చేసి నాతో పాటు శంకర్ దాదాలో నటించమని అడిగారట. అప్పట్లో మంచి ఫాంలో ఉన్న రవితేజ అన్నయ్య ఇప్పుడు నా రెమ్యునరేషన్ తెలుసు కదా..పైగా మీతో సినిమా అంటే నాకు క్రేజ్ అంతగా ఉండదు అని నిర్మొహమాటంగా అన్నాడట. దాంతో చిరంజీవి సరే ని కాల్ కట్ చేశారట.
రవితేజ అలా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంతకంటే అద్భుతంగా చేసే నటుడ్ని పట్టుకోవాలని..అప్పటికే చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం చూపిస్తున్న శ్రీకాంత్ కి కాల్ చేశారట. విషయం చెప్పగానే అన్నయ్యా నేను వస్తున్నా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవి పక్కన అంటే వదులుకునే ఛాన్సే లేదని ..అవసరమైతే హీరోగా చేస్తున్న సినిమాను కూడా వదిలేస్తానని చెప్పాడట. ఆ తర్వాత కొంతకాలం చిరంజీవికి, రవితేజకి మాటలు తగ్గాయని..ఈ గ్యాప్ లో శ్రీకాంత్ బాగా దగ్గరయ్యాడని అందరికీ తెలిసిందే. ఆ లోటు రవితేజకి అలా ఉండిపోయే ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ఛాన్స్ వస్తే వదులుకోలేదు.