News"మా తెలుగు హీరోలు అందుకు పనికి రారా బే".. అభిమానులకి కోపం...

“మా తెలుగు హీరోలు అందుకు పనికి రారా బే”.. అభిమానులకి కోపం తెప్పిస్తున్న IMDB సర్వే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు సర్వేలు చేసి పాపులర్ స్టార్స్ పేర్లను హైలెట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా ప్రముఖ సినిమా డేటాబేస్ సంస్థ ఐఎండిబి 2023 పాపులర్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది . ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాలు షో ల గురించి అందులో నటీనటుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటికి సంబంధించిన రేటింగ్స్ ఐఎండిబి సంస్థ ఇస్తూనే ఉంటుంది .కాగ ప్రతి నెల లేదా సంవత్సరం ఇండస్ట్రీ వైస్ ఓవరాల్ గా టాప్ టెన్ స్టార్స్ ఎవరు అంటూ ప్రకటిస్తూ ఉంటుంది . మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఐఎండిబి సంస్థ పదిమంది స్టార్స్ ను రిలీజ్ చేసింది .

అందులో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు షారుక్ ఖాన్ ..ఆ తర్వాతి స్థానంలో ఆలియా, దీపికా పదుకొనే, వామికా గబ్బి, నయనతార, తమన్నా , కరీనాకపూర్ ,శోబితా ధూళిపాల, అక్షయ్ కుమార్ ,విజయ్ సేతుపతి ఉన్నారు . అయితే ఈ ర్యాంకింగ్స్ లో మన సౌత్ హీరోలు ఒక్కరు కూడా లేకపోవడం అభిమానులకు మింగుడు పడడం లేదు . అసలు నాయనతార, విజయ్ సేతుపతి తప్ప ఎవ్వరు కూడా సౌత్ యాక్టర్స్ లేకపోవడం ఇప్పుడు అభిమానులకి కోపం తెప్పిస్తుంది. బాలీవుడ్ సినిమాల ఆధారంగానే ఇలా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news