ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో ఎలా వల్గర్ పంచెస్ ఎక్కువైపోతున్నాయో మనం చూస్తూనే వస్తున్నాం. మరి ముఖ్యంగా టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి కొందరు కమెడియన్ దారుణాతి దారుణమైన కుళ్ళు జోకులు కూడా వేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్ గా షోకి వచ్చిన బేబీ మూవీ హీరో వీరాజ్ ను అడగకూడని ప్రశ్న అడిగాడు కమెడియన్ ఇమ్మానుయేల్ . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న రష్మీ జడ్జెస్ కుష్బూ సైతం షాక్ అయిపోయారు .
స్కిట్లో భాగంగా విరాజ్ అశ్విన్ తో పంచెస్ వేస్తూ కమెడియన్ ఇమ్మానుయేల్..” వైష్ణవి చైతన్యతో మీరు చేసిన బెడ్రూం సీన్ గంట వీడియో కావాలి.. నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి అంటాడు”. దీంతో విరాజ్ సైతం షాక్ అయ్యాడు . అయితే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు . అంతే కాదు ఇది చాలా నీచమైన డైలాగ్ అని సోషల్ మీడియాలో జానాలు కామెంట్స్ చేస్తున్నారు . మీ కామెడీ కోసం పక్క వాళ్ళ లైఫ్ తో ఆడుకుంటారా ..? వైష్ణవి చైతన్య ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే సిట్యుయేషన్ అది ..?
మీరు ఇలా చీప్ గా దానిపై కామెంట్స్ చేయడం అస్సలు బాగోలేదు అంటూ దారుణంగా ఫైర్ అయిపోతున్నారు. నవంబర్ 24 ప్రసానం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఈ డైలాగ్ వైరల్ గా మారింది . దీంతో కొందరు జనాలు ఏకిపారేస్తున్నారు . మరి కొందరు మాత్రం వాళ్ళు చేసిన పనేగా అడుగుతున్నారు ..? అప్పుడు చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు ప్రశ్నిస్తే వచ్చిందా ..? అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి బేబీ క్లైమాక్స్ సీన్ వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!