Movies"వాడి గురించి ప్రశ్నలు అడగొద్దు"..విజయ్ వర్మ తో తమన్నా నిజంగానే బ్రేక్...

“వాడి గురించి ప్రశ్నలు అడగొద్దు”..విజయ్ వర్మ తో తమన్నా నిజంగానే బ్రేక్ అప్ చెప్పేసుకుందా..?

ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎంత త్వరగా పడుతుందో.. ఎంత త్వరగా మాయం అయిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ప్రేమ అంటే కొన్ని జన్మలకు అలాగే ఉండేది . కానీ ఇప్పుడు ప్రేమ చాలా ట్రెండీగా కమర్షియల్ గా మారిపోయింది . అడిగింది తీసి ఇవ్వకపోయినా ..ఫ్రీడమ్ ఇవ్వకపోయినా.. అంతే ప్రేమ ముక్కలైపోతుంది. మళ్లీ కొత్త ప్రేమను ఇచ్చే మగాడు వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాడు.

ప్రజెంట్ జనరేషన్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది . అయితే రీసెంట్ గా హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్నాము .. డేటింగ్ చేస్తున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే వీళ్ళ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న ఈ జంట ఈ మధ్యకాలంలో బయట మీడియాకు కనిపించడం లేదు.

అంతేకాదు పలు ఇంటర్వ్యూలలో తమన్న విజయవర్మకు సంబంధించిన ప్రశ్నలను అడగద్దు అని ముందుగానే చెప్పేస్తుందట . అంతేకాకుండా విజయవర్మ సైతం ఎటువంటి సినిమాకి కమిట్ అవ్వకుండా ఇంట్లో నుంచి బయటకు రాకుండా డిప్రెషన్ కి గురయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో నిజంగానే తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పేసుకున్నారా ..? అసలు వీళ్ళు బ్రేకప్ కి కారణం ఏంటి..? లేకపోతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకారేనా ..? వీటి తెర పడాలి అంటే తమన్నా విజయవర్మ స్పందించాల్సిందే ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news