Moviesబిగ్ షాకింగ్: ఇండియా వదిలి వెళ్లిపోతున్న ఆ స్టార్ హీరో.. ఇప్పుడు...

బిగ్ షాకింగ్: ఇండియా వదిలి వెళ్లిపోతున్న ఆ స్టార్ హీరో.. ఇప్పుడు అందరి కడుపు మంట తీరిందా..?

వామ్మో .. ఏంటిది ఎన్టీఆర్ ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడా ..? కొన్నాళ్లపాటు అక్కడే ఉండబోతున్నాడా ..? ఇది నిజంగా నందమూరి అభిమానులకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ప్రెసెంట్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కొందరు చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ స్పందించలేదు అంటూ ఘాటుగా స్పందిస్తుంటే .. మరికొందరు వరుణ్ లావణ్య పెళ్లికి ఆహ్వానం అందిన కావాలనే వెళ్లలేదు అంటూ ఎన్టీఆర్ ని దెప్పి పొడుస్తున్నారు.

ఛాన్స్ దొరికితే చాలు ఎన్టీఆర్ ని నెగిటివ్ గా చూపించడానికి ఇష్టపడుతున్నారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా అలాగే వాళ్లకు ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు . కాగా తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం దేవర సినిమా షూటింగ్ . మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. కొరటాల శివ ఈ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించారు .

అయితే ఇండియాలో కొంత చిత్రీకరణ జరుపుకున్న దేవర సినిమా ఇప్పుడు అమెరికా పయనమవుతుంది. అంతేకాదు ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను కొన్ని ఇంపార్టెన్స్ సీన్స్ ను అక్కడే చిత్రీకరించబోతున్నారట . కేవలం 10 – 15 రోజులు , ఒక నెల కాదు దాదాపు మూడు నెలలకు పైగానే ఎన్టీఆర్ అమెరికాలో ఉండబోతున్నాడు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే కొందరు మాత్రం ఎన్టీఆర్ ఫారిన్ కి వెళ్లడానికి వేరే రీజన్ ఉంది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . మరికొందరు మాత్రం ఇలా మాట్లాడుకొని మీ కడుపు మంట చల్లార్చుకోండి రా వెధవల్లారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news