Newsలావ‌ణ్య త్రిపాఠి సినిమాల‌తో ఎంత ఆస్తి కూడ‌బెట్టిందో తెలుసా... !

లావ‌ణ్య త్రిపాఠి సినిమాల‌తో ఎంత ఆస్తి కూడ‌బెట్టిందో తెలుసా… !

నటి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తెలుగింటి కోడలు అయిపోయింది. లావణ్య ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అయిన లావణ్య తెలుగు సినిమాలలో నటిస్తూ ఇక్కడ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన లావణ్య వ‌రుస‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ ప్రేమలో పడింది.

2015 లో వచ్చిన మిస్టర్ సినిమా షూటింగ్ టైంలో ఇటలీలో వరుణ్ – లావణ్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి అంతరిక్షం సినిమాలోను నటించారు. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు ఇటీవల పెళ్లి చేసుకుని దంపతులు అయ్యారు. లావణ్య త్రిపాఠి 2012లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పదేళ్లపాటు ఆమె సినిమాలలో నటిస్తూ ఉంది.

ఈ 10 ఏళ్లలో సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల‌లోనూ నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఈ 10 ఏళ్లలో లావణ్య ఎంత ఆస్తి కూడబెట్టుకుంది.. ఆమె సొంతంగా ఎంత సంపాదించుకున్నది.. అన్నదానిపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. లావణ్య ఒక్కో సినిమాకు రూ.50 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఆమె టాప్ హీరోయిన్ అయినా ఏనాడు సినిమాకు కోటి రూపాయలను మించిన రెమ్యునరేషన్ తీసుకోలేదు.

ఇప్పటివరకు లావణ్య సినిమాల ద్వారా రూ.20 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా భారీగానే ఉంది. లావణ్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావటమే కాకుండా.. వారికి తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news