Newsఅక్కినేని అభిమానులకి బిగ్ దివాళి గిఫ్ట్.. కొత్త కోడలు వచ్చేస్తుందోచ్..!!

అక్కినేని అభిమానులకి బిగ్ దివాళి గిఫ్ట్.. కొత్త కోడలు వచ్చేస్తుందోచ్..!!

ఇది నిజంగా అక్కినేని అభిమానులకు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు అక్కినేని ఫ్యామిలీకి కోడలు లేదని .. అసలు అక్కినేని నాగార్జున – అమల కోడలు విషయాన్ని పట్టించుకోవడంలేదని ..ఉన్న కోడలు పిల్ల సమంత నాగచైతన్యకు డివర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది అని ..అఖిల్ ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందే నువ్వు నాకు వద్దు రా బాబు అంటూ వెళ్లిపోయిందని తెగ వార్తలు వినిపించాయి . ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే ఫైనల్లీ ఎట్టకేలకు అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఈసారి అక్కినేని ఇంటికి రాబోయేది పెద్ద కోడలు కాదు చిన్న కోడలు అంటూ తెలుస్తుంది. అక్కినేని అఖిల్ త్వరలోనే బడా బిజినెస్ మాన్ మనవరాలని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది టోటల్గా ప్రేమ వివాహమే అంటున్నారు సినీ ప్రముఖులు . సొసైటీలోనే టాప్ మోస్ట్ బిజినెస్మేన్ అయిన స్టార్ బిజినెస్ మాన్ మనవరాలిని అఖిల్ ప్రేమించాడట . అంతేకాదు అఖిల్ గురించి అక్కినేని కుటుంబం గురించి అన్ని తెలిసిన ఆయన తన మనవరాలని అక్కినేని ఇంటికి కోడలుగా పంపించాలని డిసైడ్ అయ్యారట.

అంతేకాదు దివాళి సందర్భంగా కాబోయే కొత్తకోడల్ని ఇంటికి కూడా ఆహ్వానించారట నాగార్జున అమల .ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. త్వరలోనే వీళ్ళ జంట నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత ఫైనల్ ముహూర్తాన్ని అభిమానులకు తెలియజేయబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే ఆ స్టార్ బిజినెస్ మాన్ మనవరాలే అఖిల్ కు ప్రపోజ్ చేసిందట. అఖిల్ గురించి తెలిసి అఖిల్ ఆల్రెడీ బ్రేకప్ అని తెలిసి ఆమె ఎలా ప్రేమించింది..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ప్రేమ ఎప్పుడూ ఎలా ఎవరికి పుడుతుందో చెప్పలేం అంటూ కొటేషన్స్ చెబుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news