Movies"పాయల్ అలాంటి హీరోయిన్ నే".. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...

“పాయల్ అలాంటి హీరోయిన్ నే”.. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ సంచలన కామెంట్స్..!!

పాయల్ రాజ్ పుత్ లీడ్ పాత్రలో నటిస్తున్న సినిమా మంగళవారం . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు . ఈ క్రమంలోనే స్టేజిపై ఆయన మాట్లాడుతూ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

అల్లు అర్జున్ ఈవెంట్ కి రావడం చాలా చాలా గ్రేట్ అని చాలా హ్యాపీగా ఉంది అని సినిమా సభ్యులు చెప్పుకొచ్చారు . బన్నీ మాట్లాడుతూ ..”ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది ..ఆర్ఎక్స్ 100 ల్యాండ్ మార్క్ ఫిలింతో పాయల్ బాగా పాపులారిటీ దక్కించుకుంది.. ఈ సినిమా ద్వారా మరింత బాగా క్రేజ్ దక్కించుకుంటుంది అని అనుకుంటున్నాను ..ఆమెకు ఈ మంగళవారం సినిమా కూడా మంచి మైల్ స్టోన్ అవుతుంది “.

“అజయ్ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు షాక్ అయిపోయాను ..ఇందులో ఇంత బోల్డ్ విషయం ఉందా ..? అంటూ ఆశ్చర్యపోయాను. ఇలాంటి సినిమాను తీయాలి అన్న నటించాలి అన్న ధైర్యం కావాలి .. పాయల్ కి ఆ గట్స్ ఉన్నాయని..టీజర్ చూసినప్పుడే నాకు అలా అనిపించింది సుకుమార్ కి కూడా అలాగే అనిపించింది .ఇప్పుడే జాతర కి సంబంధించిన సీన్స్ షూట్ చేసాం.. మీకు కచ్చితంగా నచ్చుతాయి. లైఫ్ లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే మనకి ఉంటారు . మన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ .. నాకు స్వాతి ప్రణవ్ లు అలాంటివాళ్లే.. ఇది వాళ్ళ ఫస్ట్ సినిమా.. వాళ్ళు ఇంకా ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను ” అంటూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news