నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీలీల కీలకపాత్రలో తరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా భగవంత్ కేసరి. యువ దర్శకుడు అనిల్ రావు పూడి దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత బాలయ్యకు ఇది వరుసగా మూడో సూపర్ డూపర్ హిట్. భగవంత్ కేసరి తాజాగా మూడో వారంలోకి అడుగుపెట్టి పలు ఏరియాలలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో తన కెరీర్‌లోనే ఎప్పుడు కనిపించని సరికొత్త రోల్‌లో బాలయ్య కనిపించారు. బాక్సాఫీస్ దగ్గర రూ.140 కోట్ల గ్రాస్ వసుళ్ళు దాటి వేసిన ఈ సినిమా రూ.65 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు యాక్షన్ బ్లాక్ ఫైట్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కి మరింత పేరు వచ్చింది. బాలయ్య – విలన్ అర్జున్ రామ్‌పాల్ మధ్య హోరాహురిగా ఈ ఫైటింగ్ ఉంటుంది.
ఈ ఫైటింగ్ మేకింగ్ వీడియో తాజాగా యూట్యూబ్లో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ఆడియన్స్ నుంచి మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఈ మేకింగ్ వీడియోలో ఈ ఫైట్ ఎలా షూట్ చేశారు.. సెట్ వెలా వేశారు.. ప్రతి ఒక్కరు ఎలా కష్టపడ్డారో బాగా చూపించారు. బాలయ్య నట విశ్వరూపం.. బాలయ్య తనకు ఎలా కోపరేట్ చేశాడో శ్రీలీల ముద్దుముద్దుగా చెప్పిన మాటలతో పాటు దర్శకుడి అనిల్ రావిపూడి స్పీచ్ హైలెట్‌గా ఉంది.
ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా టాలీవుడ్‌లో మరో రెండు వారాలపాటు సరైన సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర అప్పటివరకు భగవంత్ కేసరి కొనసాగనుంది. ఇక మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉన్న బాలయ్య తన 19వ సినిమాని భావి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.