Newsతెలుగు సినిమా ర‌చ‌యిత చ‌నిపోతే ర‌ష్యా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రా...

తెలుగు సినిమా ర‌చ‌యిత చ‌నిపోతే ర‌ష్యా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రా గొప్ప వ్య‌క్తి…!

బ‌తికి ఉన్న‌ప్పుడు.. ఎంతో మంది స్నేహితుల‌ను కోరుకుంటారు. అదేవిధంగా చ‌నిపోయిన త‌ర్వాత కూడా అంద‌రూ రావాల‌ని కోరుకునేవారు కూడా ఉన్నారు. వాళ్ల‌కి క‌బురు పంపించండి.. వీళ్లకు చెప్ప‌డం.. చివ‌రి చూపు కోసం.. అంటూ అనేక మందికి క‌బురు పెడ‌తారు. కానీ, కొంద‌రి విష‌యంలో మాత్రం ఎలాంటి హ‌డావుడీ లేదు. చ‌డీచ‌ప్పుడు కూడా లేదు. వారు ఎలా ఈ భూమి మీద‌కు వ‌చ్చారో.. అంతే నిశ్శ‌బ్ధంతో వెళ్లిపోయారు. కానీ, ఈ మ‌ధ్య కాలంలో వారు చేసిన హ‌డావుడి.. ఈ ప్ర‌పంచానికి అందించిన ఆణిముత్యాలు అన్నీ ఇన్నీకావు.

శ్రీరామ జ‌య‌రామ‌.. సీతారామ‌- అంటూ సాగే.. ముత్యాల‌ముగ్గులో పాట రాసినా.. సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్ర‌ద‌ర్‌.. స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్ర‌ద‌ర్ అని రెండు విరుద్ధ భావాలు ఉన్న పాటలు రాసినా.. ఆయ‌న‌కే చెల్లింది. కూన‌ల‌మ్మ‌-క‌వితా సంపుటి ద్వారా.. త‌న‌పై త‌నే జోకులు వేసుకున్నా.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌నే ఆరుద్ర‌! చాలా మందికి తెలుసో.. తెలియ‌దో.. ఈయ‌న ర‌చ‌యిత‌గా అందరికీ ప‌రిచ‌య‌మే. కానీ, న‌టుడిగా రెండు మూడు సినిమాల్లోనూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

ఆరుద్ర అస‌లు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడుగా పేరు పొందారు. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత కె.రామలక్ష్మితో ఆయ‌న జీవితాన్ని సాగించారు. క‌మ్యూనిస్టు ఉద్య‌మ భావాల‌ను పుణికి పుచ్చుకున్న ఆయ‌న‌.. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువు కు స్వస్తి పలికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని పెట్టారు.

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి దూర‌పు బంధువు. ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవర కూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు. అయితే.. ఈయ‌న క‌విత్వానికి ఎంత ఆద‌ర‌ణ ఉందో పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఆయ‌న వ్యక్తిగ‌త జీవితాన్ని మాత్రం బ‌య‌ట‌కు రానిచ్చేవారు కాదు. చివ‌ర‌కు ఆయ‌న ఎలా వ‌చ్చానో.. అలానే వెళ్లిపోవాలి! అనే కోరుకున్నారు.

అందుకే ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. స‌తీమ‌ణి రామ‌ల‌క్ష్మిగారు ఎవ‌రికీ చెప్ప‌లేదు. నిజానికి హైద‌రాబాద్ న‌డిబొడ్డున చిక్క‌డ‌ప‌ల్లిలోనే నివాసం ఉన్నా.. అంత్య‌క్రియ‌లు పూర్త‌యి.. సాయంత్రం మీడియాకు ప్రెస్‌నోట్ (మూడు లైన్లు) విడుద‌ల చేసే వ‌ర‌కు ఆరుద్ర మ‌ర‌ణ వార్త‌.. ఈ ప్ర‌పంచానికి తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆయ‌న‌దేముంది.. తెలుగు సినిమా వ‌ర‌కే ప‌రిచ‌యం అనుకుంటే పొర‌పాటు.. ర‌ష్యాలో ఆయ‌న‌కు నివాళిగా.. ప్ర‌భుత్వం ఒక పూట సెల‌వు ప్ర‌క‌టించింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news