Movies"హాయ్ నాన్న"లో నానికి భార్య గా మరో స్టార్ హీరోయిన్..నేషనల్ అవార్డ్...

“హాయ్ నాన్న”లో నానికి భార్య గా మరో స్టార్ హీరోయిన్..నేషనల్ అవార్డ్ విన్నర్ ని పట్టేసారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరో నాని లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్ , పాటలు అన్నీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి .

ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడు డైరెక్టర్ . కాగా ఈ సినిమాలో నాని ఓ పాపకు తండ్రిగా నటించబోతున్న విషయం తెలిసిందే . అయితే నానికి భార్యగా ఎవరు నటిస్తారు అన్న విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో నాని భార్య పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతుందట .

అయితే ఆ పాత్ర కేవలం 15 నిమిషాలకు మించి ఉండదట. ఆ పాత్ర సగంలోనే చచ్చిపోతుంది . ఆ తర్వాతే నాని మనిషిగా మారి తన కూతురు పట్ల బాధ్యతగా వహిస్తాడట . ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్ . ఆల్రెడీ వీళ్ళ కాంబోలో దసరా సినిమా వచ్చింది. నేను లోకల్ సినిమా వచ్చింది . రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . ముచ్చటగా మూడోసారి నాని కీర్తి సురేష్ తెరపై కనిపించబోతూ ఉండడంతో వీళ్ళ హిట్ కాంబో రిపీట్ అవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news