Moviesత్రిషపై మన్సూర్ అలీ చెత్త వ్యాఖ్యలు.. హీరో నితిన్ చేసిన పనికి...

త్రిషపై మన్సూర్ అలీ చెత్త వ్యాఖ్యలు.. హీరో నితిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. రీసెంట్గా ఆయన నటించిన చిత్రం లియో. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష ని ఉద్దేశించి తీవ్ర అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఆమెను రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశపడుతూ కామెంట్ చేశాడు. “త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్లో రేప్ సీన్ ఉంటుందని భావించాను అని.. నా చేతులతో ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానని.. కానీ అసలు ఈ చిత్రంలో త్రిషకు నాకు సన్నివేశాలు లేవు అంటూ ఘాటుగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు”. దీనిపై త్రిష కూడా ఘాటుగా ఫైర్ అయింది .

అయితే ఇలాంటి క్రమంలోనే త్రిషకు సపోర్ట్ చేస్తూ పలువురు స్టార్ హీరోయిన్స్ హీరోలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే నటి రోజా తీవ్రంగా మన్సూర్ అలీ ఖాన్ పై మాట్లాడిన విషయం తెలిసిందే . రీసెంట్గా హీరో నితిన్ సైతం త్రిష ఫై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ను తప్పు పడుతూ ట్వీట్ చేశాడు. ” అలీఖాన్ త్రిష కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న .. ఇలాంటి అహంకార పూరిత వ్యాఖ్యలను చేయడం తప్పు .. ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకు చోటు లేదు .. మహిళలకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరు ఖండించాలి అంటూ పోస్ట్ చేశారు “. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news