వివి వినాయక్ టాలీవుడ్ లో ఒకప్పుడు ఊర మాస్ సినిమాలతో సెన్సేషనల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన రెండో సినిమాతోనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా తెరకెక్కించి తిరుగులేని ప్రశంసలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా నితిన్ తో దిల్, చిరంజీవితో ఠాగూర్, వెంకటేష్‌తో లక్ష్మి లాంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఆ టైంలో వినాయక్ పేరు మార్మోగిపోయింది. నిజం చెప్పాలంటే వినాయక్ కంటే ముందు ఏడాది ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో రాజమౌళి మెగా ఫోన్ పట్టారు.
ఈ ఇద్దరు తొలి 5 సినిమాల వరకు బాక్సాఫీస్ దగ్గర ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా పోటీపడ్డారు. ఒకరు సూపర్ హిట్ ఇస్తే ఆ తర్వాత మరొకరు దానిని మించిన హిట్ సినిమా తీసేవారు. ఠాగూర్ నిజంగా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత వచ్చిన వినాయక్ సినిమాలు అంచనాలు అందుకోలేదు. క్రమక్రమంగా వినాయక్ మూస ఫార్మాట్లోకి వెళ్లిపోయాడు. రాజమౌళి అసలు అపజయం అన్నది లేకుండా తిరిగిలేని డైరెక్టర్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వినాయక్‌ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం వినాయక్‌తో సినిమాలు చేసేందుకు ఆయన వెంటపడేవారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోలు కూడా వినాయక్‌కు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఇంటిలిజెంట్ సినిమా చూశాక వినాయక డైరెక్షన్ మరిచిపోయాడు అన్న సెటైర్లు గట్టిగా పడ్డాయి. అంత డిజాస్టర్ అయింది ఆ సినిమా. ఇక తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి బాలీవుడ్‌లో ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తే అంత భారీ బడ్జెట్ సినిమాకు కనీసం రూ.50 లక్షలు కూడా రాలేదు. అంటే వినాయక్ దర్శకత్వ ప్రతిభ ఎంత ఘోరంగా అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు వినాయక్‌ని ఎవరు కనీసం దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో పాత రికార్డు వాడుతూ చిరంజీవికి గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వినాయక్ – చిరంజీవి కాంబినేషన్లో ఠాగూర్ తో పాటు ఖైదీ నెంబర్ 150 సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. అందులో ఖైదీ నెంబర్ 150లో వినాయక్ దర్శకత్వ ప్రతిభ ఏమీ లేదు. అది అప్పటికే తమిళంలో హిట్ అయిన సినిమా. పైగా 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయినా ఈ సినిమాను చాలా వరకు చిరంజీవితో పాటు ఆయనకు నమ్మకస్తులే డైరెక్ట్ చేశారని చెబుతూ ఉంటారు.
వినాయక్‌ని పూర్తిగా డమ్మీని చేసేసారని అంటారు. నిజంగా ఖైదీ నెంబర్ 150 సినిమా వినాయక్ వల్ల హిట్ అయింది అనుకుంటే ఆ వెంటనే తీసిన ఇంటిలిజెంట్ ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో చూశాం.
మధ్యలో వినాయక్ – బాలయ్య బాబుకు కూడా బిస్కెట్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలయ్య బాబుతో సినిమా చేయాలనేది తన కోరిక అని చెన్నకేశవరెడ్డి తర్వాత మరోసారి మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనుకున్నా కుదరలేదని డబ్బాలు కొట్టుకుంటున్నారు.
బాలయ్య ఇప్పుడున్న ఫామ్‌లో వినాయక్‌తో సినిమా చేయటం చాలా పెద్ద రిస్క్. బాలయ్యతో ఎలాగో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని వినాయక్ ఇప్పుడు చిరంజీవికి సోప్ రాసే పనిలో ఉన్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో సెటైర్లు పడుతున్నాయి. మరి డైరెక్షన్ మర్చిపోయిన వినాయక్‌ని చిరంజీవి అక్కున చేర్చుకుని ఛాన్స్ ఇస్తాడో లేదో కాలమే నిర్ణయించాలి. ఒక వేళ ఇచ్చినా భోళాశంకర్ 2 వస్తుందేమో ? చూడాలి.