Newsబోనీక‌పూర్‌కు మూడో భార్య‌గా ఊర్వ‌శీ రౌతేలా... ఈ వ‌య‌స్సులో ఇదేంట్రా బాబు..!

బోనీక‌పూర్‌కు మూడో భార్య‌గా ఊర్వ‌శీ రౌతేలా… ఈ వ‌య‌స్సులో ఇదేంట్రా బాబు..!

బాలీవుడ్ లో స్టార్ నిర్మాత బోనికపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోనీకపూర్ అంతకుముందు ఒక సాధారణ నిర్మాత. అప్పటికే బోనీకపూర్ కు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. బోనీకపూర్ తొలి సంతానమే ప్రస్తుత బాలీవుడ్ క్రేజీ హీరో అర్జున్ కపూర్.. మొదటి భార్య ఉండగానే బాలీవుడ్ లో తిరిగిలేని స్టార్ హీరోయిన్గా ఉన్న దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవితో ప్రేమలో పడ్డాడు.

శ్రీదేవి కూడా చాలా మంది చేతిలో మోసపోవడంతో తనకంటూ ఒక తోడు ఉండాలన్న ఆత్రుతతో బోనీ మాయమాటలకు లొంగిపోయింది. అలా బోనీ వలలో పడిపోయి బోనీని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక ఐదేళ్ల క్రితం శ్రీదేవి దుబాయ్ లో తన మేనల్లుడు వివాహ వేడుక నిమిత్తం వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి పై చాలా మందికి.. చాలా అనుమానాలు ఉన్నాయి.

శ్రీదేవి చనిపోయి కూడా ఐదేళ్లు దాటుతుంది. అయితే ఇప్పుడు ఈ వయసులో బోనికపూర్ మూడో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఒక హాట్ హీరోయిన్ తో కావడం విశేషం. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు ఊర్వశీ రౌతేలా అని ప్రచారం జరుగుతుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌ల‌కు ఊర్వ‌శి కేరాఫ్‌గా మారిపోయింది. ఊర్వశి ఇప్పటికే భారత క్రికెటర్లు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా తో పాటు పలువురు హీరోలతో రిలేషన్ లో ఉందంటూ వార్తల్లోకి ఎక్కింది.

ఇక ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం ఆమె బోనీ కపూర్ తో చనువుగా ఉంటుందని, బోనీకపూర్ కూడా ఆమెతో బాగా తిరుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. బోనీకి ఉన్న ఆస్తి పాస్తులు చూసి ఊర్వసి బోనీని వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం బాలీవుడ్ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. మరి కొందరు మాత్రం వీరి మధ్య నిర్మాత – హీరోయిన్ రిలేషన్ మాత్రమే ఉంది తప్ప వేరే రిలేషన్ కాదని కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం బోనీని అస్సలు నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news