Newsలావ‌ణ్య త్రిపాఠితో పెళ్లి కోసం వ‌రుణ్ తేజ్ ఏం చేశాడో చూడండి...!

లావ‌ణ్య త్రిపాఠితో పెళ్లి కోసం వ‌రుణ్ తేజ్ ఏం చేశాడో చూడండి…!

మెగా హీరో వరుణ్ తేజ్ మరికొద్ది రోజుల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇటలీలో ఈ జంట పెళ్లి జరగబోతుంది. పెళ్లి తర్వాత వీరు కొద్దిరోజులు అక్కడే ఉండబోతున్నారు కూడా.. మరి వరుణ్ తేజ్ సినిమాల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో తన నిర్మాతలకు ఇబ్బందులు కలగకూడదు కదా..! అందుకే తాను ప్ర‌స్తుతం న‌టిస్తోన్న అన్ని పనులు పూర్తి చేసేసాడు వరుణ్ తేజ్.

ఈ ఏడాది ఇప్పటికే గాండివధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చక చక పూర్తి చేశాడు. గత రెండు వారాలుగా కంటిన్యూగా షెడ్యూల్ జరుగుతోంది. తాజాగా చేసిన ప్యాచ్ వర్క్ తో పాటు టోటల్ షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఎయిర్పోర్ట్ యూనిఫాంలో ఉన్న వరుణ్ తేజ్ హీరోయిన్ మనుషి చిల్లర్ తో ఉన్న ఫోటోల‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 8న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అదే టైంలో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమా ప్రమోషన్ టైంకు అందుబాటులోకి రావాలన్నదే వరుణ్ తేజ్ ప్లాన్.

వరుణ్ తేజ్ చేతిలో మరో సినిమా కూడా ఉంది. కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను కూడా లాంచ్ చేశాడు. పెళ్లి తర్వాత హనీమూన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. అటు లావణ్య త్రిపాఠి కూడా తన చేతిలో ఉన్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసింది. ఏదేమైనా పెళ్లి కోసం వరుణ్ తన నిర్మాతలకు ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేసి ఇటలీకి చెక్కెయ్యనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news