Newsచివ‌ర‌కు విజ‌య్ కూడా ర‌ష్మిక‌కు అన్యాయం చేశాడే...!

చివ‌ర‌కు విజ‌య్ కూడా ర‌ష్మిక‌కు అన్యాయం చేశాడే…!

ఎస్ ఇప్పుడు నిజంగానే ఈ మాట అనుకోవాలి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తనకు అత్యంత సన్నిహితురాలు రష్మికకు అన్యాయం చేశాడన్న గుసగుసలు నడుస్తున్నాయి. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది నుంచి విజయ్ ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మాణంలో… పర‌శురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుగుతుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 13వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో 54వ సినిమాగా వస్తుంది. ఫ్యామిలీ, ఎమోషన్స్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయట. గతంలో విజయ్ – పరశురాం కాంబినేషన్లో వచ్చిన గీతగోవిందం ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో ముందుగా శ్రీలీల‌ను హీరోయిన్ అనుకున్నారు. ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో విజయ్ కు బాగా కలిసి వచ్చిన రష్మిక మందన్నను హీరోయిన్గా అనుకున్నారు. కారణం ఏదైనా రష్మిక బదులు ఇప్పుడు మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. అసలే శ్రీలీల‌ దెబ్బతో రష్మికకు ఛాన్సులు లేకుండా పోతున్నాయి.

ఈ టైంలో విజయ్ తన సినిమాలో రష్మిక హీరోయిన్గా తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మృణాల్‌ ఠాకూర్ వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు విజయ్ లాంటి హీరోయే రష్మికని పట్టించుకోకపోతే ఇంకెవరు ?పట్టించుకుంటారు.. ఆమెను ఆమెకు టాలీవుడ్ లో ఎవరో అవకాశాలు ఇస్తారు అన్నది కూడా చర్చ‌గా మారింది. ఇక శ్రీలీల దెబ్బకు రష్మికకు వరుసగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. మళ్లీ ఆమెకు సరైన ఛాన్స్ ఇచ్చి ఆమె లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేలా ఆదుకునే హీరోలు, దర్శకులు ఎవరో కాలమే నిర్ణయించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news