క్రికెటర్లు, సినీ హీరోయిన్లకు మధ్య ప్రేమాయణాలు, డేటింగులు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళితే మరికొన్ని మధ్యలోనే పెటాకులు అవుతూ ఉంటాయి.అలా చాలామంది క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచే కాదు గత నాలుగు ఐదు దశాబ్దాల నుంచే కొనసాగుతూ వస్తోంది.
కొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఏకంగా పాక్ క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చాయి. ఈ లిస్టులో ఉన్న హీరోయిన్లను చూద్దాం. నటి సోనాలి బింద్రే తెలుగు వారికి కూడా బాగా పరిచయం.. ఆమె మహేష్ బాబు మురారి, ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కి జోడిగా నటించారు. ఈ నటి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగినట్టు సమాచారం. అటు షోయబ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి ఫోటో తన పర్సులో ఉందని చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడ్డారని అప్పట్లో ప్రచారం గట్టిగా నడిచింది.
మరోవైపు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ సంబంధం కూడా అప్పట్లో హాట్ టాపిక్.. అయితే వసీంతో తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుస్మితాసేన్ ఒక ప్రకటనలో ఖండించింది.. ఇది రూమర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. నటి రేఖ పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మధ్య కూడా ఘాటు ప్రేమ నడిచినట్టు ప్రచారం ఉంది. ఇద్దరు తమ బంధం పై ఎప్పుడు ?బహిరంగంగా ప్రకటించలేదు. అయితే వీరు బంధం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా క్రికెటర్ అబ్దుల్ రజాక్ సహజీవనం చేసినట్టు ప్రచారం ఉంది. అయితే దుబాయ్ లో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఇద్దరం కలిసి పాల్గొన్నామని.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని తమన్నా కొట్టి పారేసింది. క్రికెటర్ మెస్సిన్ ఖాన్ – బాలీవుడ్ నటి రీనా రాయ్ ప్రేమాయణం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.. అయితే వీరి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. వీరికి ఓ కూతురు పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరి కూతురు పేరు సనమ్.. అలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు ఓ సంచలనంగా ఉండేవి.