Newsహీరో న‌వీన్‌చంద్ర భార్య ఆ స్టార్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్...

హీరో న‌వీన్‌చంద్ర భార్య ఆ స్టార్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అని తెలుసా..!

టాలీవుడ్లో యంగ్ హీరోగా, విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటులలో నవీన్ చంద్ర ఒకరు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. తర్వాత అరవింద సమేత ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి తో పాటు మరికొన్ని సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా మంత్ ఆఫ్ మధు సినిమాతో ఈ నెల 6న‌ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

ఈ సినిమాలో న‌వీన్‌కు జోడీగా కలర్స్ స్వాతి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే నవీన్ చంద్ర టాలీవుడ్ లో కుర్ర హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నవీన్ చంద్ర భారీ గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. మనోడి భార్య పేరు ఓర్మా. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

గతేడాది ప్రేమికుల రోజున సోషల్ మీడియా వేదికగా న‌వీన్‌చంద్ర తన భార్యను పరిచయం చేశాడు. ఓర్మా స్వస్థలం కేరళ. ఓర్మా – నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను కేరీర్‌ పరంగా సక్సెస్ సాధించడం వెనక త‌న‌ భార్య ఉందని.. నవీన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఓర్మా ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిక్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారని.. నా సినిమాల కథల ఎంపికలో ? కూడా ఆమె తన వంతుగా సహకారం అందిస్తూ ఉంటారని నవీన్ చంద్ర తెలిపారు.

ఓర్మా భవిష్యత్తులో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని నవీన్ చెప్తున్నారు. ఇక మంత్ ఆఫ్ మధు సినిమాతో నవీన్ చంద్ర ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని ధీమాతో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news