సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, సహజీవనాలు బ్రేకప్ లు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసుకుంటున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని భావించి చివరకు విడిపోయిన సినిమా ప్రేమ జంటలు ఎవరెవరో చూద్దాం.
ఉదయ్ కిరణ్:
టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఉదయ్ కిరణ్ చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో ఒక్కసారిగా పలు హిట్ కొట్టి తిరుగులేని స్టార్ హీరో అయిపోయారు.
ఆ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ కు ఎంగేజ్మెంట్ అయింది. సుస్మిత ముందుగా ఉదయ్ కిరణ్‌ను ఇష్టపడడంతో కుమార్తె కోరిక మేరకు చిరంజీవి వీరికి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. అనంతరం సుస్మితకు చెన్నైకు చెందిన వ్యక్తితో పెళ్లి జరగగా.. ఉదయ్ కిరణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు..ఆ తర్వాత కెరీర్ పరంగా ఫాల్డౌన్ కావడంతో ఆత్మహత్య చేసుకొని మరణించారు.
తరుణ్ :
ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు సినిమాలతో తిరుగులేని క్రేజ్ వచ్చింది. తనతో కలిసి నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలో నటించినా అప్పటి క్రేజీ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఘాటుగా ప్రేమించుకున్నారు..పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే తరుణ్ తల్లి రోజారమణికి ఆర్తి అగర్వాల్ ని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది.
నయనతార :
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రభుదేవా తన మొదటి భార్య రమలతతో విడాకులు కూడా ఇచ్చారు. చివరి క్షణంలో వీరి మధ్య గొడవలు జరగడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
అఖిల్ అక్కినేని:
అక్కినేని కుటుంబ మూడోతరం వారసుడుగా అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అఖిల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ ను ప్రేమించాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే వీరు పెళ్లి వరకు వెళ్లకుండానే మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో బ్రేకప్ చెప్పుకున్నారు.
హన్సిక :
దేశముదురు సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది హన్సిక.. తమిళ హీరో శింబు , హన్సిక ప్రేమలో పడ్డారు. వీరు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ టైంలోనే వీరి మధ్య మనస్పర్ధలతో విడిపోయారు. ఆ తర్వాత హన్సిక తన వ్యాపార భాగస్వామి సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకున్నారు.
రానా – త్రిష:
రానా – త్రిష కలిసి సినిమాలు చేయకపోయినా వీరు ప్రేమలో పడ్డారు. వీరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నా దగ్గుబాటి కుటుంబం ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. త్రిషకు ఇప్పటకీ పెళ్లి కాలేదు. రానా మాత్రం మిహికా బజాన్‌ను పెళ్లాడాడు.