Moviesఅరుదైన వ్యాధికి గురైన స్టార్ హీరో భార్య..పాపం ఎంత కష్టం వచ్చిందో..!

అరుదైన వ్యాధికి గురైన స్టార్ హీరో భార్య..పాపం ఎంత కష్టం వచ్చిందో..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు వరుసగా రోగాల బారిన పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రీజన్ ఏంటో తెలియట్లేదు .. కానీ చక్కటి హెల్త్ డైట్ ఫాలో అవుతున్నా.. రోజుకి 6 గంటలు వ్యాయామం చేస్తున్న పలు భయంకరమైన రేర్ డిసీజెస్ కి గురవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ లో కోలీవుడ్ లో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రకరకాల వింత వ్యాధులకు గురయ్యారు .

తాజాగా ఆ లిస్టులోకి వెళ్ళిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ భార్య వితిక షెరూ. హీరోయిన్గా పలు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక దక్కించుకునింది వితిక . ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది . తాజాగా ఆమె యూట్యూబ్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసింది .

ఈ వీడియోలో వెతిక తనకు హెల్త్ బాగోలేదు అన్న విషయాన్ని కూడా చెప్పింది . ఇటీవల తనకు స్పాండిలైటిస్ .. మైగ్రేన్ సమస్యలు వచ్చాయట. మెడ నొప్పి , తలనొప్పి , వల్ల ఏ పని చేయలేకపోతుందట. అందుకే ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటుందట . ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేసింది . దీంతో వితిక త్వరగా కోలుకోవాలని అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news