సావిత్రి భారతీయ సినీ ప్రపంచంలో ఎప్పటికీ తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్. ఆమె చనిపోయి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆమె గురించి ఈ తరం సినీ అభిమానులు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంటే ఆమె సినిమాలతో తెలుగు ప్రేక్షకులను.. తెలుగు ప్రజలను ఎంతలా మైమరిపించారో అర్థం చేసుకోవచ్చు. సావిత్రి హీరోయిన్గా ఒక వెలుగు వెలిగినప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారు.
ఆమెను చూసేందుకు చెన్నై వెళ్లే తెలుగు జనాలకు ఆమె కడుపునిండా తన చేతి వంట పెట్టి.. దారి చార్జీలకు డబ్బులు లేకపోతే ఇచ్చి మరీ పంపేవారట. సావిత్రమ్మకు అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండేవి. ఆమె కెరీర్లో చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న జెమినీ గణేష్ ను పెళ్లి చేసుకోవటం. సావిత్రమ్మ ఆర్థికంగా బాగున్న రోజుల్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినప్పుడు ఎంతోమందికి ఎన్నో గుప్త దానాలు చేశారు.
ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బాగా సెటిల్ అయిన వారు కూడా ఆమె సాయం పొందిన వారే. అయితే ఆమె కెరీర్ పతనావస్థ దశలో ఉన్నప్పుడు ఆమె నుంచి గుప్తదానాలు భారీగా సాయాలు పొందిన వారే ఆమెను పక్కన పెట్టేశారు.. కనీసం సావిత్రి వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడేవారు కాదట. ఆమె ఆర్థికంగా బాగున్న రోజుల్లో మరో స్టార్ హీరోయిన్ బి సరోజ కు లక్షలాది విలువైన వజ్రాలహరాన్ని ఆమె వద్ద ఉంచమని ఇచ్చారట.
సావిత్రి ఆర్థికంగా చితకుపోయినప్పుడు దానిని తిరిగి ఇవ్వమని అడిగితే సరోజ ఇచ్చేందుకు ఇష్టపడలేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది. సావిత్రి కూడా సరోజకు బహుమతిగా ఆ హారం ఇవ్వలేదు.. నీ దగ్గర ఉంచు అవసరమైనప్పుడు తీసుకుంటానని చెప్పారట. అయితే సావిత్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె అడిగినా సరోజ మాత్రం దానిని తిరిగి ఇచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదని.. ఆమె సరోజకు హారం ఇచ్చినట్టు సాక్ష్యం కూడా లేకపోవడంతో దానిని మర్చిపొమ్మని చెప్పిందని టాక్ ?