రియాలిటీ షోలకు బాస్ బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఏడో సీజన్ కొనసాగుతుంది. ఈసారి డిఫరెంట్ గా రెండుసార్లు లాంఛింగ్ పెట్టారు. మొదటిసారి 14 మందిని హౌస్ లోకి పంపించారు. మొదటిసారి హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లలో ఐదుగురు ఎలిమినేట్ అవ్వగా.. రెండోసారి మినీ లాంచ్‌పెట్టారు. ఈసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. పేరుకు మినీ లాంచ్ కానీ.. చాలా గ్రాండ్గా చేశారు.
సిద్ధార్థ్ – రవితేజ వంటి సెలబ్రిటీలను తీసుకువచ్చి సందడి చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న షర్టు చాలామందికి భలే నచ్చేసింది. దాంతో ఈ షర్టు ధర ఎంత ఉంటుంది ? ఎక్కడ దొరుకుతుంది అని.. నెట్ ఇంట్లో జనాలు సెర్చ్ చేస్తున్నారు. ఇది లూయిస్ వ్యూటన్ బ్రాండ్ కు చెందిన లగ్జరీ షర్టు. దీని ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మనం షాక్ అవుతాం.
ఈ చొక్కా ఖరీదు వందలు.. వేలల్లో కాదు ఏకంగా లక్షల్లోనే ఉంది. నాగార్జున వేసుకున్న ఈ స్టైలిష్ షర్ట్ రేటు రెండు లక్షల పైచిలుక ఉంది. గూగుల్ లో దాని రేటు 2,25,495 రూపాయలు చూపిస్తోంది. ఇలాంటివి చూసి ఆనందించాలి కానీ కొనుక్కోవాలని ఆశపడకూడదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అటు నాగ్ అభిమానులు మాత్రం బిగ్‌బాస్ షో పోస్ట్ అంటే మినిమం మైంటైన్ చేయాలిగా.. అయినా మన్మధుడు ఏ డ్రెస్ వేసిన అదరగొడతాడు అని చెప్పుకొస్తున్నారు.