Newsత‌మ‌న్నాకు మంట పెట్టే ప్ర‌శ్న... మీకు ఎవ‌రు చెప్పారంటూ కోపంతో ఊగిపోయింది...!

త‌మ‌న్నాకు మంట పెట్టే ప్ర‌శ్న… మీకు ఎవ‌రు చెప్పారంటూ కోపంతో ఊగిపోయింది…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు 15 సంవత్సరాల పాటు తన సినిమాలతో తమన్నా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా పద్ధతిగా నటించిన తమన్నా ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్లో తమన్నా అంటే యూత్‌లో మంచి కిక్ ఉండేది. హ్యాపీడేస్ సినిమాలో తమన్నాను చూసిన తెలుగు కుర్ర కారు పిచ్చెక్కిపోయింది.

అయితే ఇప్పుడు తమన్నా వయసు 35కు వచ్చేసింది. ఇప్పుడు ఆమె సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటికే వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోల పక్కన జోడి కట్టిన తమన్నా త్వరలో బాలయ్య సినిమాలో కూడా జోడి కట్టనుంది. ఇటు వెండితెరతో పాటు అటు బుల్లితెరపై వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ సీన్ల‌లో రెచ్చిపోతుంది. తన ప్రియుడు విజయ్‌వ‌ర్మ‌తో కలిసి ఇప్పటికే సహజీవనం చేస్తున్న తమన్నా అతడితో కలిసి వెబ్ సిరీస్లలో బోల్డ్ సీన్లు.. మూతిముద్దు సీన్లతో ఎంతలా రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం.

దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మీడియాపై ఫైర్ అయింది. మీరు కెరీర్ స్టార్టింగ్ లో పద్ధతిగా ఉండేవారు.. సాంప్రదాయపద్ధమైన పాత్రలలో నటించేవారు వయసు పెరుగుతున్న కొద్ది మీలో బోల్డ్ నెస్ ఎక్కువైంది.. తగ్గిన అవకాశాలు పెంచుకోవడానికేనా ? తిప్పలు అని యాంకర్ తమన్నాను అడిగాడు.. ఈ ప్రశ్న విన్న వెంటనే తమన్నా కోపం కట్టలు తెంచుకుంది.

తోచింది రాసిన అంత తేలిక కాదు యాక్టింగ్.. అయిన నాకు అవకాశాలు తగ్గాయని మీకు ఎవరు చెప్పారు ?నేను రోజుకి 18 గంటలు పని చేస్తున్నా ఇంత బిజీగా గతంలో కూడా లేను.. నా పరిధి ఏంటో నాకు తెలుసు నా ప్రవర్తన వేషధారణ అనేవి.. పాత్ర డిమాండ్ ను బట్టి ఉంటాయని చెప్పింది. క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తాను.. ఒక పాత్ర ఒప్పుకున్నాక దానికి పూర్తి న్యాయం చేయటమే నటిగా నా ధర్మం.. హాఫ్ నాలెడ్జి ప్రశ్నలు అడగవద్దు ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చింది. తమన్నాను ఈ ప్రశ్న ఎంతగా గుచ్చిందో ఆమె ఇచ్చిన ఆన్సర్ చూస్తేనే తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news