టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే నిన్న తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . అక్టోబర్ 13 పూజ హెగ్డే పుట్టినరోజు ఈ క్రమంలోనే రెండు రోజులు ముందుగానే బర్త్ డే ప్లానింగ్ కోసం మాల్ దీవ్స్ కి వెళ్లిన పూజ తన పుట్టినరోజును చాలా చాలా హ్యాపీగా కూల్ గా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది . మాల్దీవ్స్ లో తన ఫ్రెండ్స్ తో తన బర్త్డ డేను బాగా ఎంజాయ్ చేసిన పూజా ..దానికి సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.
వాటర్ లో నెట్ బెడ్ వేసుకొని ఎంచక్కా పడుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇలాంటి క్రమంలోనే పూజా బర్త్ డే కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో పంపిన గిఫ్ట్ వైరల్ గా మారింది . మొదటి నుంచి పూజ అంటే లక్కీ లక్కీ హీరోయిన్గా భావించే హీరో ఆమెకు స్పెషల్గా గిఫ్ట్ పంపించినట్లు తెలుస్తుంది.
అంతేకాదు ఆ గిఫ్ట్ లో ఆమెకు ఎంతో ఇష్టమైన స్పెషల్ కాస్ట్లీ వాచ్ ని కూడా పంపించారట . ఐరన్ లెగ్ అంటూ చాలామంది హీరోలు పూజను దూరం పెడుతూ ఉంటే ..ఈ స్టార్ హీరో మాత్రం పూజను ఎంతో లైక్ చేస్తూ ఆమె కోసం ఏకంగా కాస్ట్లీ గిఫ్ట్ ను ఇలా బర్త డే రోజు ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!