Newsమళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్.. ఆ పాన్ ...

మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్.. ఆ పాన్ ఇండియా సినిమాతోనే..లక్కి హీరో..!!

అదృష్టం .. ఎప్పుడు ..ఎవరిని ..ఎలా ..వరుస్తుందో ..ఎవరు చెప్పలేరు అలాంటి అదృష్టాన్ని ఇప్పుడు తన పాకెట్లో వేసుకున్నాడు తరుణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తరుణ్ కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి హిట్ సినిమాలలో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరీ ముఖ్యంగా నువ్వు లేక నేను లేను , నువ్వే కావాలి లాంటి సినిమాలు ఇప్పటికీ మనం తెరపై చూసి ఎంజాయ్ టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాము అంటే దానికి కారణం తరుణ్ నటన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఎక్కువైపోతుంది . ఈ క్రమంలోనే తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు తరుణ్ .

త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోకి బ్రదర్ పాత్రలో కనిపించబోతున్నాడట తరుణ్.. కథపరంగా పాజిటివ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ గల పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే వ్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news