Newsజైలు నుంచే జాక్వెలిన్‌కు సుఖేష్ ఘాటు ప్రేమ‌లేఖ‌... ఇంత వేద‌న‌తోనా..!

జైలు నుంచే జాక్వెలిన్‌కు సుఖేష్ ఘాటు ప్రేమ‌లేఖ‌… ఇంత వేద‌న‌తోనా..!

నవరాత్రి వేళ కాన్‌మెన్‌ సుకేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మరో ఘాటు ప్రేమలేఖ రాశారు. నవరాత్రి తొమ్మిది రోజులు తాను ఉపవాసం ఉండనున్నట్టు ఆ లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు. బేబీ ( జాక్వెలిన్‌) నీ కన్నా మరెవరు అందంగా లేరు… నవరాత్రి సందర్భంగా మన జీవితంలో అంతా మంచే జరగాలని.. నా జీవితంలో తొలిసారి ఉపవాసం ఉండాలని ఫిక్స్ అయ్యాన‌ని పేర్కొన్నాడు.

ఆ దేవి మాత దయతో అంతా మనకు మంచే జరుగుతుందని.. సుఖేష్ తన లేఖలో జాక్విలిన్‌పై తనకున్న అపార ప్రేమను బయటపెట్టారు. నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. మనమిద్దరం త్వరలోనే ఒక్కటి కాబోతున్నామని కూడా తెలిపాడు. జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి జీవిస్తాం మై బేబీ గర్ల్ అంటూ లేఖ‌లో సుకేష్ రాసుకు వచ్చాడు.

మా వైష్ణోదేవి మహాకాళేశ్వర ఆలయంలో స్పెషల్ పూజ హారతి చేయాలని లేఖలో సుఖేష్ జాక్వెలిన్‌ను కోరాడు. లేఖలో చివరగా ఏ జైలు నిన్ను ప్రేమించడని ఆపలేవు.. నీకోసం చంపడానికి.. చనిపోవడానికి నేను సిద్ధం అన్నారు.. ఇక రు.200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తిహార్ జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. సుఖేష్‌పై ఫోర్జరీ కేసుతో పాటు మ‌రికొన్ని కొన్ని కేసులు కూడా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news