మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కాలం కలిసి రావటం లేదు. ఆయన నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్లు అవుతున్నాయి. ఇటీవల కాలంలో వాల్తేరు వీరయ్య సినిమా మినహాయిస్తే చిరూ నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్. సైరా తాజాగా వచ్చిన భోళా శంకర్ అన్ని పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అసలు చిరంజీవి సినిమా అంటే మెగా అభిమానులే పట్టించుకోవడం లేదు. భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియా ఫాంటసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు చిరూ సోషియా ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చిరంజీవి కెరీర్లో 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మామూలుగా చిరంజీవికి ఇప్పుడున్న మార్కెట్ నేపథ్యంలో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్క్.
అయితే దర్శకుడు వశిష్ట ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అన్న నమ్మకం అయితే ఉంది. కథ కూడా బాగా వచ్చింది అంటున్నారు. యూవీ వాళ్లు ఏ ఉద్దేశంతో చిరంజీవిని నమ్మి రూ.200 కోట్లు పెడుతున్నారు చాలామందికి అర్థం కాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. ఈ విషయంలో చిరంజీవి టాలీవుడ్ యంగ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప1, పుష్ప 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర కూడా రెండు పార్ట్‌లుగా రానున్న సంగతి తెలిసిందే. సినిమాకు రూ.200 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. అయితే రెండు పార్ట్‌లుగా తీసుకువస్తే చాలా సులువుగా గట్టెక్కవచ్చు అన్న నమ్మకంతోనే నిర్మాతలు ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇలా అయినా చిరంజీవి వెండితెర మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో..? లేదో..? చూడాలి.