Newsకాజ‌ల్ - శ్రీలీల మ‌ధ్య చిచ్చు పెట్టిన బాల‌య్య‌... అస‌లేం జ‌రుగుతోంది...!

కాజ‌ల్ – శ్రీలీల మ‌ధ్య చిచ్చు పెట్టిన బాల‌య్య‌… అస‌లేం జ‌రుగుతోంది…!

ఎస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఇదే విషయం చర్చ‌కి వస్తోంది. చందమామ కాజల్ అగర్వాల్ టైం అస్సలు బాగోలేదనిపిస్తోంది. కాజల్ కు పెళ్లి అయ్యాక కూడా సినిమాలలో నటించాలన్న కోరిక బలంగా ఉంది. అయితే ఆమెకు ఛాన్సులు వస్తున్నా అందుకు తగినట్టుగా సినిమాలు హిట్ అవ్వటం లేదు. గతంలో ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా.. ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ సినిమాకి హీరోయిన్ అవసరం లేదన్న కారణం చూపించి మధ్యలోనే ఆమె పాత్రను లేపేసారు.

కాజల్ అప్పట్లో చాలా ఫీల్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా విషయంలోనూ అదే జరుగుతోందట. ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, స్టిల్స్.. పాటలు చూస్తుంటే కాజల్ ఎక్కడా కనపడటం లేదు. అసలు కాజల్ గురించి చర్చ జరగటం లేదు. ఈ సినిమాలో మరో కీలకపాత్రలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్ శ్రిలీల గురించి మాత్రమే చర్చి నడుస్తోంది.

ఎవరి నోట విన్న శ్రీ లీల, బాలయ్య కాంబినేషన్ ఎలా ఉంటుందనే ? వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఎలా ఉంటుంది ? అన్నదానిపై చర్చించుకుంటున్నారు తప్ప బాలయ్యకి జోడిగా కాజల్ నటిస్తోందనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. వీరిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్.. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ? అన్న డిస్కషన్ అయితే ఇక్కడ జరగడం లేదు. దీనికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రచార చిత్రాలు, పోస్టర్లు.. వీడియోలలో కూడా కాజల్ కు పెద్దగా హైప్ ఇస్తున్న దాఖలాలు కూడా లేవు.

ఎక్కడ చూసినా శ్రీలీల , బాలయ్య హంగామానే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ అయ్యాక శ్రీ లీల, కాజల్ పాత్రలు కంపేర్ చేస్తే కచ్చితంగా శ్రీ లీల కాజల్ ను కంప్లీట్గా డామినేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌ళ్లీ కాజ‌ల్‌కు షాక్ త‌ప్పేలా లేదు. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య పక్కన నటించి గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలన్న ఆశలతో ఉన్న కాజల్ కోరిక నెరవేరేలా కనపడటం లేదని క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇక కాజల్, కమలహాసన్ కి జోడిగా ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. ఆ ప్రాజెక్టు కూడా పడుతూ లేస్తూ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news